Pawan Kalyan : స్టార్ హీరోలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాస్ట్ గా ఏ హీరో కూడా లేదు అని చెప్పొచ్చు.ఈయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ రీసెంట్ గానే పూర్తి చేసాడు.ఇక డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ సినిమా ‘హరి హర వీరమల్లు’ చిత్రం క్లైమాక్స్ తప్ప మొత్తం పూర్తి అయ్యినట్టే.ఈ ఏడాది లోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

#PKSDT మూవీ ఈ ఏడాది జులై 28 వ తారీఖున విడుదల అవ్వబోతుండగా, హరి హర వీరమల్లు సినిమా దసరా కానుకగా విడుదల అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఈ రెండు సినిమాలతో పాటుగా హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం , అలాగే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో #OG అనే చిత్రం కూడా ఒప్పుకున్నాడు మన పవర్ స్టార్.

ఈ రెండు సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపే ప్రారంభం కాబోతుండగా,#OG మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 15 వ తారీఖు నుండి ప్రారంభం కానుంది.ఈ సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఈమధ్యనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సౌత్ ఇండియన్ స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చెయ్యడానికి అన్నీ విధాలుగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు.ఈమధ్యనే తమిళ స్టార్ హీరో విజయ్ ని కలిసి ఒక సినిమాని ఫిక్స్ చేసిన ధోని, త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త బలంగా వినిపిస్తుంది.ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్నాడట.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
