Pawan Kalyan : ‘బ్రో ది అవతార్’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు ప్రస్తుతం ఆయన ఎన్నికల్లో బిజీ గా ఉండడం వల్ల తాత్కాలికంగా ఆపేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలను జెట్ స్పీడ్ లో పూర్తి చెయ్యడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత ఆయన ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసాడు.
తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి, కమర్షియల్ డైరెక్టర్స్ లో ప్రస్తుతం తనది శంకర్ రేంజ్ అని నిరూపించుకున్న దర్శకుడు అట్లీ. ఇతనితో పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాడని టాక్. పవన్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడిగా ఆయన ప్రతీ విషయాన్నీ ప్లాన్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కాంబినేషన్ ని సెట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడట. సన్ పిక్చర్స్ తో భాగస్వామ్యం అయ్యి నిర్మిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడు సినిమాలు సగం సగం పూర్తి అయ్యాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మే నెల నుండి సెప్టెంబర్ లోపు బ్యాలన్స్ ఉన్న ఆ మూడు సినిమాలను పూర్తి చేసేస్తాడట. ఆ తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నెల 30 వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉండడం తో ఆరోజే ఈ సినిమాకి పూజ కార్యక్రమాలు చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రాబోతున్నాయి. రీసెంట్ గానే జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా ఫిక్స్ అవ్వడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.