పవన్ కళ్యాణ్ -యంగ్ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఆ సినిమానే ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్స్టర్’.. ఈ సినిమా పై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. అదిరిపోయే కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ముంబై జరిగిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాలు అన్నీ కూడా అక్కడే తెరాకెక్కించారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు..
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ ఏడాది డిసెంబర్ 22 న క్రిష్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. మూడు రోజులు హాలిడేస్ కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.. కాగా,ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది.. పవన్ కు 100 కోట్ల నిర్మాత డివివి దానయ్య ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మొదటి నుంచి చివరి దాకా త్రివిక్రమ్ డీల్ చేసి సెట్ చేసారని, ఆయనకు ఇంత అమౌంట్ ను ఇస్తున్నారని తెలుస్తోంది..
పవన్ సినిమా కావడంతో ఈ సినిమా రైట్స్ బాగా ఎక్కువ ఉండనున్నాయి. ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ కు ఓటిటి సంస్దల నుంచి, టీవి ఛానెల్స్ నుంచి పోటీ విపరీతంగా ఉందని సమాచారం.. పవన్ సినిమా కాబట్టి రైట్స్ కూడా భారీగా ఉండవచ్చునని అంచనా..గ్యాంగ్స్టర్ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ మూడు విభిన్న వేరేయేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్ , మూడు డాన్ ఇలా మూడు విభిన్న పాత్రలతో కనిపించనున్నాడని సమాచారం.. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది..