Pushpa 2 : పుష్ప2 లో పవన్ కల్యాణ్.. ఈ దెబ్బతో బాక్సాఫీస్ బాక్స్ బద్దలేగా..

- Advertisement -

Pushpa 2 : పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2 ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఇప్పుడు మరోవార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కానున్నారట. సినిమాలో నటిస్తున్నారా? అనే డౌట్ వస్తుంది కదూ.. నిజానికి ఈ సినిమాలో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ మొదట్లో కొన్ని డైలాగులను పవన్ చెప్పబోతున్నారట. పవన్ కళ్యాణ్ వాయిస్ ను ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -
pawan kalyan
pawan kalyan

ఇక ఇటీవల అల్లు అర్జున్ కి బర్త్ డే రోజు విషెస్ చెబుతూ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ ని కూడా చేశారు. ఈ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేసేందుకు సుక్కు పవన్ కళ్యాణ్ ను దించబోతున్నారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. ఏది ఏమైన ఈ వార్త బన్నీ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక మందన్న నటిస్తుంది. సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here