ఇదెక్కడి అరాచకం సామీ.. మోషన్ పోస్టర్ తోనే గూస్ బంప్స్ రప్పించిన పవన్ కళ్యాణ్ ‘బ్రో’

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్న చిత్రం ‘బ్రో’. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ మూవీ స్టోరీ లైన్ ని తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు.

Pawan Kalyan

ఈ చిత్రం జులై 28 వ తారీఖున విడుదల కాబోతుంది. నిన్న మొన్నటి వరకు #PKSDT అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడిన ఈ సినిమాకి సంబంధించిన అసలు టైటిల్ ‘బ్రో’ అని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు.వీటికి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా మోషన్ పోస్టర్ వీడియో కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. శివునికి సంబంధించిన శ్లోకాలు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూ ‘బ్రో’ అంటూ సాగే ఈ వీడియో సినిమా పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

- Advertisement -
పవన్ కళ్యాణ్ 'బ్రో'
పవన్ కళ్యాణ్ ‘బ్రో’

నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం పై ఫ్యాన్స్ అసలు అంచనాలే పెట్టుకోలేదు, ఎందుకంటే ఇది ఒక తమిళ సినిమాకి సంబంధించిన రీమేక్ అని ప్రచారం జరగడం వల్లే, కానీ అభిమానుల్లో నెలకొన్న ఆ నెగటివ్ అంచనాలను మొత్తం ఈ వీడియో తుడిచిపారేసింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ స్వాగ్ తో బ్లాక్ టీ షర్ట్ వేసుకొని పవన్ కళ్యాణ్ స్టైల్ గా నిల్చున్న ఈ ఫస్ట్ లుక్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అని అంటున్నారు. మరి సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటుందా లేదా అనేది తెలియాలంటే జులై 28 వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here