విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడా..? ఆరోజుల్లో ఫేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ పై ఇన్ని నెగటివ్ కామెంట్స్ చేశాడా!

- Advertisement -

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని యూత్ లో ఏర్పర్చుకున్న హీరో విశ్వక్ సేన్. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా విశ్వక్ సేన్, ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం తో వరుసగా హీరోగా నటించే అవకాశాలు వచ్చాయి.

విశ్వక్ సేన్
విశ్వక్ సేన్

అవి ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్స్ కాకపోయినా, విశ్వక్ సేన్ కి మంచి ఇమేజిని అయితే తెచ్చిపెట్టింది.ఇది ఇలా ఉండగా విశ్వక్ సేన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందు సోషల్ మీడియా లో ఒక మామూలు వ్యక్తిగానే ఉండేవాడని విషయం చాలా మందికి తెలియదు. ఈయన అసలు పేరు దినేష్ నాయుడు, సినిమాల్లో పేరు ట్రెండీ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన పేరు మార్చుకున్నట్టు తెలుస్తుంది.

Vishwak Sen

అయితే విశ్వక్ సేన్ అలియాస్ దినేష్ నాయుడు అప్పట్లో ఫేస్ బుక్ లో ఫ్యాన్ వార్స్ కూడా చేసేవాడట. ఈయన ఎన్టీఆర్ కి పెద్ద వీరాభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే, సోషల్ మీడియా లో అభిమానులతో జరిగే గొడవల్లో ఈయన అప్పట్లో పవన్ కళ్యాణ్ పై చాలా నెగటివ్ కామెంట్స్ కూడా చేసాడని టాక్. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన పెట్టిన ఆ కామెంట్స్ అన్నిటినీ డిలీట్ కూడా చేసాడట.

- Advertisement -
DInesh Naidu

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ విశ్వక్ సేన్ చిత్రం ఓపెనింగ్ కి ఒకసారి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి అర్జున్ సర్జా దర్శకుడు, ఈ సినిమా అర్జున్ తో ఏర్పడిన కొన్ని విబేధాల కారణం గా షూటింగ్ ప్రారంభానికి ముందే ఆపేయాల్సి వచ్చింది.అయితే విశ్వక్ సేన్ కి సంబంధించిన ఈ ఆసక్తికరమైన నిజాలను తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here