మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పవన్ కళ్యాణ్..గూస్ బంప్స్ రప్పిస్తున్న #OG మూవీ స్టోరీ!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం తమ అభిమాన హీరో చేస్తున్న సినిమాలలో ‘#OG’ చిత్రం పై బోలెడంత ఆశలు పెట్టుకున్నారు. కుర్ర డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రీసెంట్ గానే ముంబై లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ని జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పాల్గొంటుంది.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి #RRR మూవీ నిర్మించిన డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. త్వరగానే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసేసి ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారట.పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇదే ఏడాది లో విడుదల అవ్వబోతుందనే వార్త తెలిసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.

మార్షల్ ఆర్ట్స్
మార్షల్ ఆర్ట్స్

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి లీక్ అయ్యింది. అసలు విషయం లోకి వెళ్తే ఇందులో పవన్ కళ్యాణ్ ‘మార్షల్ ఆర్ట్స్’ ట్రైనర్ గా నటిస్తున్నాడు. ఒకప్పుడు మాఫియా డాన్ గా ముంబై ని గడగడలాడించిన పవన్ కళ్యాణ్ కొన్ని అనుకోని కారణాల వల్ల అజ్ఞాతవాసం ఉంటూ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు.

- Advertisement -

ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కనోజా నేతృత్వం లో షాట్స్ కోసం అబ్యాసం చేస్తున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.వాటిని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ ని ఎవ్వరూ ఇంత అందం గా చూపించలేదని. డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ లోని వింటేజ్ యాంగిల్ ని బయటకి తీసి ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here