మన టాలీవుడ్ లో మోస్ట్ బోల్డ్ జంట గా పేరు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ మరియు నరేష్ కలిసి ‘మళ్ళీపెళ్లి’ అనే చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. చాలా కాలం వరకు డేటింగ్ చేసుకొని ఈమధ్యనే పెళ్లి చేసుకున్న ఈ జంట పై సోషల్ మీడియా లో ఎలాంటి నెగటివిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తరచూ మీడియా లో ఉండే ఈ ఇద్దరి జంట ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది.

రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా గురించి పవిత్ర లోకేష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని సమాజానికి అద్దం పట్టే విధంగా తీర్చిదిద్దారు. ఒక జంటకి మధ్య ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా ఎలా వాళ్లిద్దరూ ఒక్కటి అయ్యారు అనేది ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దినట్టు ఆమె చెప్పుకొచ్చారు’.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా మా నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని చేశామా, లేదా కల్పిత కథనా? , అనేది నేను ఇప్పుడే రివీల్ చెయ్యను. సినిమా చూసినప్పుడు మీకే అర్థం అయిపోతుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక నరేష్ తో జీవితం ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకి పవిత్ర సమాధానం చెప్తూ ‘నరేష్ చాలా సరదా మనిషి. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా చాలా కూల్ గా ఉంటాడు. రేపు ఏమి జరగబోతుంది అనే దాని గురించి ఆయన ఆలోచించారు , ఈరోజు ఏమి జరగబోతుంది అనే దానిపైనే ఆయన ఆలోచిస్తాడు. నా వ్యక్తిత్వం పై బ్లాక్ మార్క్ పడి, నా కెరీర్ ని సర్వనాశనం చెయ్యాలని చూసిన కొంతమందిని చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఆ సమయం లో నరేష్ నాకు ఇచ్చిన ధైర్యం వల్లే ఈరోజు బ్రతికి ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.
