రీసెంట్ గా సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టించిన ప్రేమ జంట నరేష్ – పవిత్ర. 60 ఏళ్ళ వయస్సులో, మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్, ఈమెతో ప్రేమ వ్యవహారం నడిపి , డేటింగ్ చేసి ,తనకంటే 20 సంవత్సరాలు చిన్న వయస్సు అమ్మాయి అయిన పవిత్ర లోకేష్ పై మనసుపడి ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వంటి సంఘటనలు సభ్య సమాజం సిగ్గు తో తల వంచుకుంది.దానికి తోడు మూడవ భార్య రమ్య పై నరేష్ అభియోగాలు వేస్తూ చేసిన కొన్ని కామెంట్స్ చాలా అసహ్యంగా అనిపించింది. పైగా ఎదో గొప్ప పని చేసినట్టు పవిత్రలోకేష్ తో లిప్ కిస్ చేస్తూ వీడియో పెట్టడం, బోల్డ్ జంట అని తమకు తామే ప్రచారం చేసుకోవడం వంటివి జనాలకు చిరాకు కలిగిచింది. అయితే ఇంత నెగటివ్ పబ్లిసిటీ ని కమర్షియల్ గా వాడుకునే క్రమం లో నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ద్వారా ఈరోజు మన ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం.

కథ :
నరేంద్ర (నరేష్ ) అనే పాపులర్ తెలుగు సినీ నటుడికి కోట్ల రూపాయిల ఆస్తి ఉంది, లక్షల్లో ప్రేమించే అభిమానులు ఉన్నారు. కానీ అతనికి ప్రశాంతత అనేది దొరకదు. ఎందుకంటే గతం లో ఆయనకీ రెండు సార్లు పెళ్లిళ్లు జరిగి విడాకులు అవ్వడమే ఆయన ప్రశాంతత దూరం అవ్వడానికి కారణం. ఆ సమయం లో ఆయన సౌమ్య సేతుపతి ( వనిత విజయ్ కుమార్) ని పెళ్లి చేసుకుంటాడు. ఆమె వల్ల కూడా ఈయనకి ప్రశాంతత అనేది దొరకదు. ఆ సమయం లో ఆయనకీ తన సహా నటి పార్వతి (పవిత్ర లోకేష్) దగ్గరవుతుంది. ఎందుకో ఆయన కోరుకునే ప్రశాంతత ఆమెలో కనిపిస్తుంది. కానీ ఆమెకి మాత్రం మొదటి భర్త నుండి ఎన్నో సమస్యలు ఎదురు అవుతాయి,ఆ సమయం లో నరేంద్ర ఆమెకి అండగా ఎలా నిలబడ్డాడు. సభ్య సమాజం ని ఎదిరించి పార్వతి ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేదే స్టోరీ.

విశ్లేషణ :
ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత MS రాజు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయన గతం లో ‘వాన’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు, ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దర్శకుడిగా ఆయన రెండవ చిత్రం గా ఈ సినిమాని చేసాడు. అయితే నిజ జీవితానికి సంబంధించిన స్టోరీ కాబట్టి, ఆడియన్స్ ని ఆసక్తిగా సినిమాని చూసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతే కాకుండా ఈ కథని వివిధ చాఫ్టర్లు ద్వారా దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. ఈ చిత్రం లో చూపించినవన్నీ నిజమో కాదో తెలియదు కానీ,చూపించిన విధానం బాగుందని చెప్పొచ్చు. ఎక్కడా బోర్ కొట్టలేదు, కానీ నరేష్ ని నేటి తరం ఆడియన్స్ హీరో గా జీర్ణించుకోవడమే కష్టం.

ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా సురేష్ బొబ్బిలి మరియు అరుళ్ దేవ్ పని చేసారు. విశేషం ఏమిటంటే వీళ్లిద్దరు పాటలతో పాటుగా , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా అందించారు, చాలా సన్నివేశాలను కాపాడింది ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.ఇక బాల రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి మైనస్ ఏమిటంటే ల్యాగ్, చాలా సన్నివేశాలను అవసరం లేకపోయినా బాగా సాగదీసినట్టు అనిపించింది.అది తప్పిస్తే మూవీ మొత్తం పర్వాలేదు అనే రేంజ్ లోనే ఉంటుంది.
నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ, భద్రమ్ తదితరులు.
దర్శకుడు : ఎం.ఎస్.రాజు
నిర్మాత : నరేష్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి
ఎడిటింగ్ : జునైద్ సిద్ధిక్యూ
చివరి మాట :
నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు.
రేటింగ్ : 2.5 /5