Pavitra Naresh : పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్లిన నరేష్ – పవిత్రల జంట.. వీడియో వైరల్..

- Advertisement -

Pavitra Naresh : తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద జంటగా మారిన నరేష్, పవిత్రలు పెళ్లి వార్తతో అందరికి షాక్‌నిచ్చారు. వివాహం చేసుకుని ఏడడుగుల బంధంలో ఏకమైన ఈ జంటకు సంభందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..కాగా, ఇప్పుడు హనీమూన్‌కు కూడా చెక్కేసింది. దుబాయ్‌లో వీరిద్దరూ విహరిస్తున్న వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ ద్వారా రివీల్ చేశారు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ #PavitraNaresh’ అంటూ నరేష్ ట్వీట్ చేశారు.

Pavitra Naresh
Pavitra Naresh

మా ఈ కొత్త ప్రయాణంలో జీవిత కాలం పాటు శాంతి, ఆనందం కోసం మీ దీవెనలు కావాలంటూ నరేష్ కోరారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, కొద్ది మంది బంధువుల మధ్య ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. న్యూయర్ వీరిద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ వీడియోను రిలీజ్ చేశారు.. అది ఎంత దుమారం రేపిందో అందరికి తెలుసు.. కాగా, నటుడు నరేష్‌కు ఇది నాల్గవ వివాహం కాగా, సహాయ నటి పవిత్ర లోకేష్‌కు ఇది రెండవ వివాహం. సినిమా షూటింగ్స్ సమయాల్లో ప్రేమలో పడ్డ ఈ జంట నాలుగేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరి మధ్య ఉన్న బంధాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో వీరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. కోర్టు తుది తీర్పు రాకుండానే, తనకు విడాకులు ఇవ్వకుండా వేరో పెళ్లికి ఒప్పుకునేది లేదని రమ్య చెబుతున్నారు.

ఈ కేసులు కోర్టులో ఉండగానే ఇప్పుడు ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు నరేష్ పవిత్రల జంట. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వీడియోను పోస్టు చేసి సెన్సేషన్ సృష్టించారు. అయితే ఇది సినిమా ప్రమోషనా లేదా నిజంగా వీరు పెళ్లి చేసుకున్నారా అనే కన్య్ఫూజన్‌లో ఉండగానే.. వీరిద్దరూ దుబాయ్‌లో దర్శనమిచ్చారు. దీంతో హనీమూన్‌కు వెళ్లారన్న వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట్లో దర్శనమివ్వడంతో నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నటు ప్రేక్షకులు భావిస్తున్నారు. దుబాయ్ ఎడారుల్లో, పలు ప్రదేశాలను సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు లేటు వయస్సులో బాగా ఎంజాయ్ చేస్తున్నారంటు కామెంట్లు పెడుతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here