టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీరి లివింగ్ రిలేషన్‌షిప్ గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇద్దరూ కలసి త్వరలో పెళ్లితో ఒక్కటి కాబోతున్నాం అని.. ఓ వీడియోలో ముద్దు పెట్టుకుని మరీ చెప్పారు. అప్పటి నుంచి వీరి మేటర్ మరింత వైరల్ అవుతోంది. అయితే తాజాగా పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ ఆమె గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవిత్ర లోకేష్ పై ఆమె రెండో భర్త సుచేంద్ర ప్రసాద్ మొదట్నుంచీ ఆరోపణలు చేస్తూనే వస్తున్నాడు. గతంలో కూడా ఆమె గురించి పలు ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి పవిత్రపై ద్వజమెత్తారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఏమైనా చేస్తుంది అంటూ ఆరోపించాడు. పవిత్ర లోకేష్ పచ్చి అవకాశవాదని, నరేష్ విషయంలో ఆమె పెద్ద ప్లాన్ వేసిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేష్ తల్లి విజయ నిర్మల లేకపోవడంతో నరేష్ ను మోసం చేసి.. ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం కొట్టేయాలని పవిత్ర ప్లాన్ చేసిందని అన్నాడు. అందుకే నరేష్ తో సహజీవనం చేస్తుందని చెప్పుకొచ్చాడు. డబ్బు కోసమే ఇప్పటి వరకూ ఇద్దరికి విడాకులు ఇచ్చిందని, డబ్బు కోసమే నరేష్ వెంట తిరుగుతోందని ఆరోపించాడు. ఏదో ఒక రోజు నరేష్ కు కూడా అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు.

ఇక మరోవైపు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రచారంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లోనూ సందడి చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహా వేదికగా జూన్ 23న ‘మళ్ళీ పెళ్లి’ స్ట్రీమింగ్ కానుంది.