‘పరేషాన్’ మూవీ ఫుల్ రివ్యూ..ఆడియన్స్ ని నిజంగానే ‘పరేషాన్’ చేసేసారుగా!

- Advertisement -

నటీనటులు : తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు.
మ్యూజిక్‌: యశ్వంత్ నాగ్
సమర్పణ : రానా దగ్గుబాటి
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
రచన, దర్శకత్వం : రూపక్ రోనాల్డ్ సన్‌.

టాలీవుడ్ లో ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రాజ్యం ఏలుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ప్రతీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తుంది. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘బలగం’, ‘దసరా’ మరియు ‘మేము ఫేమస్’ వంటి సినిమాలే. ఇప్పుడే కాదు గతం లో కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘డీజే టిల్లు’, ‘ఫిదా’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాలుగా విడుదలై సెన్సేషన్ సృష్టించాయి. ఈ సక్సెస్ ఫార్ములా ని పసిగట్టిన దర్శక నిర్మాతలు ఇప్పుడునా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ లైన్ లోనే నేడు ‘పరేషాన్’ అనే చిత్రం విడుదలైంది. రోనాల్డ్ రూపక్ దర్శకత్వం లో తిరువూర్ హీరో గా నటించిన ఈ చిత్రానికి రానా దగ్గుపాటి సమర్పకుడిగా వ్యవహరించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయం ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

పరేషాన్
పరేషాన్

కథ :

- Advertisement -

ITI లో ఫెయిల్ అయ్యి పని పాటా లేకుండా స్నేహితులతో బలాదూర్ గా గాలితిరుగుడు తిరుగుతులు ఉంటాడు ఐజాక్ (తిరువూర్). కొడుకు చెడిపోతున్నాడే, దేనికి పనికి రాకుండా పోతున్నాడే అని సమర్పణం(మురళి ధర్ గౌడ్) బాధపడుతూ ఉంటాడు. కొడుకు జీవితాన్ని ఎలా అయినా సెటిల్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో తన సింగరేణి ఉద్యోగం ని కొడుక్కి వచ్చేలా చేసేందుకు తన భార్య నగలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి కొడుక్కి ఇస్తాడు సమర్పణం. దీనిని సింగరేణి లో పనిచేస్తున్న పైరవీ కి లంచం ఇవ్వాల్సిందిగా చెప్తాడు.కానీ అదే సమయం లో తన స్నేహితుడు ఆపదలో ఉండేసరికి, ఆ డబ్బుని స్నేహితుడికి ఇచ్చేస్తాడు ఐజాక్. ఆ తర్వాత తండ్రి సమర్పణం ఆ డబ్బులను ఏమి చేసావు రా అంటూ ప్రతీ రోజు ఇంట్లో పంచాయితీ పెట్టి గొడవ చేస్తుంటాడు. మరోపక్క తన ప్రేయసి శిరీష (పావని కరణం) తన వల్ల గర్భం దాల్చింది అనే విషయం తెలుసుకొని, అబార్షన్ చేయించడానికి డబ్బులు సమకూరుస్తాడు ఐజాక్. కానీ ఆ డబ్బులను తన స్నేహితుడు కొట్టేస్తాడు.ఆ తర్వాత ఐజాక్ జీవితం లో చోటు చేసుకున్న సంఘటనలే మిగిలిన స్టోరీ.

పరేషాన్ మూవీ ఫుల్ రివ్యూ
పరేషాన్ మూవీ ఫుల్ రివ్యూ

విశ్లేషణ :

ఈ చిత్రం చూస్తున్న ప్రతీ తెలంగాణ బిడ్డకి డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ పై తీవ్రమైన ఆగ్రహం వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పేయొచ్చు. తెలంగాణ యువకులు మొత్తం తాగుపోతులు, పనీపాట లేకుండా గాలి తిరుగుడులు తిరుగుతూ ఉంటారు అని చెప్పే విధంగా అనిపిస్తుంది. ఈ చిత్ర కథ మొత్తం సింగరేణి ప్రాంతం లో జరుగుతుంది.అక్కడ మందు తాగేవాళ్ళు ఎక్కువ, అందుకే డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసాడు. అది చూసే ప్రేక్షకులకు ఎలా అర్థం అవుతుంది అంటే, ఏ సందర్భం వచ్చినా తెలంగాణ కురాళ్ళ మందు తాగుతారు , మందు అంటే పడిసచ్చిపోతారు అనే విధంగా అర్థం అవుతుంది. కొన్ని కొన్ని సార్లు సంస్కృతి కి చెందిన సున్నితమైన అంశాలను ముట్టుకోకూడదు, ఇక్కడ డైరెక్టర్ ఆ జోన్ ని టచ్ చెయ్యడమే తప్పు.

అయితే కాసేపు తెలంగాణ సంస్కృతి ని కించపరిచారు అనే విషయాన్నీ పక్కన పెట్టేసి, సినిమాని సినిమాలాగే చూస్తే మాత్రం మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తీర్చి దిద్దాడు అని అనిపిస్తుంది. అబార్షన్ చేయించడానికి హీరో పడే ‘పరేషాన్’ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. కథ మధ్యలో గాడితప్పి వేరే ట్రాక్ లోకి వెళ్లినా, ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రోనాల్డ్ రూపక్.ఇక హీరో గా నటించిన తిరువూర్ చాలా సహజం గా చేసాడు. ఆ పాత్రని చూసి చాలా మంది కుర్రాళ్ళు తమని తాము అద్దం లో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది, కొత్త హీరోయిన్ పావని కూడా చాలా చక్కగా నటించింది. ఇక తండ్రి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మురళి ధర్ గౌడ్ కూడా ఈ చిత్రం లో చాలా చక్కగా నటించాడు. యస్వంత్ నాగ్ సంగీతం కూడా బాగుంది, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ప్రధాన సన్నివేశాల్లో చాలా చక్కగా కొట్టాడు యస్వంత్.

చివరి మాట :

హీరో తో పాటు ఆడియన్స్ ని కూడా డైరెక్టర్ కాసేపు ‘పరేషాన్’ చేసినప్పటికీ, ఎంటర్టైన్మెంట్ విషయం లో మాత్రం పరేషాన్ చెయ్యలేదు. ఈ వీకెండ్ కి సరదాగా స్నేహితులతో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఈ చిత్రం.

రేటింగ్ : 2.5 / 5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here