‘మోసగాళ్లకు మోసగాడు’ క్లోసింగ్ కలెక్షన్స్.. ఆ ప్రాంతం లో ‘సింహాద్రి’ రికార్డ్స్ అవుట్!

- Advertisement -

మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ ట్రెండ్ పుణ్యమా అని అలనాటి వెండితెర అద్భుతాలను సరికొత్త 4K టెక్నాలజీ ప్రింట్ తో థియేటర్స్ లో చూసే అదృష్టం నేటి తరం ఆడియన్స్ కి కలుగుతుంది. అలా రీ రిలీజ్ ట్రెండ్ లో బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఖుషి, పోకిరి , జల్సా , ఒక్కడు, ఆరెంజ్, బిల్లా మరియు రీసెంట్ గా సింహాద్రి ఇలా ఎన్నో సినిమాలు రీ రిలీజ్ లో సంచలనం సృష్టించాయి.

మోసగాళ్లకు మోసగాడు
మోసగాళ్లకు మోసగాడు

ఈ చిత్రాలన్నీ కూడా నేటి తరం ఆడియన్స్ ఉన్న సమయం లో విడుదల అయ్యాయి, అందుకే అంత సక్సెస్ అయ్యింది అనుకోవచ్చు. కానీ మన తాతల కాలం నాటి సినిమా అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. రీసెంట్ గా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో మే 31 వ తారీఖున రీ రిలీజ్ చేసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ టీజర్ తో అటాచ్ చేసి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడం తో మొదటి రోజు దాదాపుగా 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులతో పాటుగా, టీజర్ కారణంగా మహేష్ బాబు అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ప్రోత్సహించారు. ఎంత టీజర్ వేస్తే మాత్రం, పాత సినిమాని రెండు గంటలకు పైగా థియేటర్స్ లో కూర్చొని చూడడం అంటే మాటలా?, ఇదంతా కేవలం కృష్ణ గారి మీద ఉన్న అమితమైన అభిమానం కారణంగానే వచ్చింది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా AMB సినిమాస్ లో ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ రీసెంట్ గా ఆ థియేటర్ లో విడుదలైన సింహాద్రి కి రెండింతలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద రెండు రోజుల క్లోసింగ్ కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here