Bigg Boss : సామాన్య రైతు బిడ్డగా సోషల్ మీడియా లో నెటిజెన్స్ మనసుల్ని కొల్లగొట్టి, తద్వారా వచ్చిన ఫేమ్ తో ఇంస్టాగ్రామ్ లో సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకొని నేడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఇతనికి అత్యధిక ఆదరణ ప్రేక్షకుల నుండి ఉంది. రెండు వారాలు నామినేషన్స్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరి కంటే అత్యధిక ఓట్లు దక్కించుకొని టాప్ 1 స్థానం లో నిల్చాడు.
అయితే బయట ఇన్ని రోజులు మనం చూసిన పల్లవి ప్రశాంత్ వేరు, లోపల మనం చూస్తున్న పల్లవి ప్రశాంత్ వేరు అని జనాల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. రెండవ వారం లో అమర్ దీప్ తో జరిగిన గొడవలో ప్రశాంత్ కి ఎక్కువ సపోర్టు వచ్చింది. కానీ ఆ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రశాంత్ ని నెగటివ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో ఇతని ఇచ్చే సిల్లీ రీజన్స్ హౌస్ మేట్స్ ని మాత్రమే కాదు, ప్రేక్షకులకు కూడా చిరాకు రప్పిస్తున్నాయి. దానికి తోడు ఎక్కువగా ఆయన అమ్మాయిలతో పులిహోర కలపడం వంటివి కూడా అసలు ఇతను బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చాడు, ఆట ఆడదానికి వచ్చాడా, లేకపోతే అమ్మాయిలతో సరసాలు ఆడేందుకు వచ్చాడా అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం జరిగిన నామినేషన్స్ లో అమర్ దీప్ ని నామినేట్ చేసేటప్పుడు సరైన రీజన్ చెప్పాడు కానీ, గౌతమ్ విషయం లో మాత్రం చాలా సిల్లీ రీజన్ చెప్పాడు. అంతే కాదు అతని మీద అభియోగం కూడా వెయ్యడం ప్రశాంత్ ని తీవ్రమైన నెగటివిటీ లోకి నెట్టేసింది.
శోభా శెట్టి ముందు చొక్కా విప్పి తిరగడం నాకు నచ్చలేదు అన్నాడు, అంత వరకు బాగానే ఉంది కానీ, శోభా శెట్టి ని ఫిజికల్ గా చేతి సైగలతో వెక్కిరించాడు, అది నాకు నచ్చలేదు అన్నాడు. ఇది మాత్రం తప్పు , ఎందుకంటే గౌతమ్ అలా ఉద్దేశపూర్వకంగా అనలేదు. మాట్లాడుతూ ఫ్లోలో అన్నాడు, దీనిని ప్రశాంత్ కావాలని అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసాడు. ఇది పక్కన పెడితే పవర్ అస్త్ర టాస్కులో తనకి ఛాన్స్ దక్కకుండా అమర్ దీప్ కి దక్కినందుకు ఏడ్చేసిన ప్రశాంత్ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఓదారుస్తాడు. అలా ఏడుస్తున్న సమయం లోనే పవర్ అస్త్ర టాస్కు కి అనర్హులు ఎవరో చెప్పమని అడగగా ఏడుస్తూనే శోభా శెట్టి పేరు చెప్తాడు. కానీ శోభా శెట్టి ముందు నీకోసమే ఏడుస్తూ చెప్పా అని అబద్దం చెప్తాడు, ఇవన్నీ మైనస్ పాయింట్స్, సరి చేసుకోకపోతే ఎదో ఒక రోజు ఎలిమినేట్ అవ్వడం పక్క అని అంటున్నారు విశ్లేషకులు.