OTT & Theatres ఈ వారం ఓటిటిలో / థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..

- Advertisement -

OTT & Theatres ప్రతి వారాంలాగే ఈ వారం కూడా ఎన్నో సినిమాకు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్ల తో పాటుగా ఓటీటీలలో విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు సైతం వీకెండ్ రాగానే బెస్ట్ సినిమాలను ఎంచుకుని ఆ సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ముఖ్యంగా ధనుష్ నటించిన సార్ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి..ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం..

OTT & Theatres
OTT & Theatres

ఈ సినిమా చక్కని మెసేజ్ ను ఇస్తుందని ట్రైలర్స్ ను చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ధనుష్ కోరుకున్న భారీ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహ షెహ్ జాదా రిలీజ్ అవుతోంది. ఇకపోతే కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. నంబర్ నైబరింగ్ నే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది..

అలాగే ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా కూడా 18వ తేదీనే థియేటర్లలో విడుదలవుతోంది. ఓటీటీల విషయానికి వస్తే కార్నివాల్ రో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండగా మాలికాపురం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హాట్ స్టార్ లో సదా నన్ను నడిపే, జె హోప్ ఇన్ ది బాక్స్ కొరియన్ సిరీస్, ద నైట్ మేనేజర్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆహా ఓటీటీలో ఈ నెల 17వ తేదీన కళ్యాణం కమనీయం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది…

- Advertisement -

లవ్ ఆన్ ది రాక్, మైనస్ వన్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ స్వేర్ లవ్ ఆల్ ఓవర్ అగైన్, అన్ లాక్ కొరియన్ సిరీస్, గ్యాంగ్ లాండ్స్ వెబ్ సిరీస్, రెడ్ రోజ్ వెబ్ సిరీస్, సర్కస్, ఫుల్ స్వింగ్, ఆఫ్రికన్ క్వీన్స్ జింగా వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ది రొమాంటిక్స్, పర్ఫెక్ట్ మ్యాచ్, ఏ సండే ఎఫైర్ కూడా వాలెంటైన్స్ డే లు కూడా స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి.. మొత్తానికి ఈ వారం భారీగానే సినిమాలు విడుదల అవుతున్నాయి.. సినీ ప్రియులకు ఇది పండగే అని చెప్పాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here