OTT Releases This Week : ఓటీటీ ఆడియన్స్ కి పండగే..రేపు మూడు క్రేజీ సూపర్ హిట్ సినిమాలు విడుదల!

- Advertisement -

OTT Releases This Week : వీకెండ్ వచ్చిందంటే చాలు, పని చేసుకునే వాళ్ళు కాస్త ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటారు. కొత్త సినిమాలు ఏమొచ్చాయి అని ఆన్లైన్ లో థియేటర్స్ ని చూస్తూ ఉంటారు. ఇక కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీ కి అలవాటు పడిన ఆడియన్స్ అయితే కొత్తగా ఓటీటీ లోకి ఏమి సినిమా వచ్చింది?, ఏమి వెబ్ సిరీస్ వచ్చింది అంటూ వెతకడం మొదలు పెడుతారు.

OTT Releases This Week
OTT Releases This Week

అలాంటి ఓటీటీ ఆడియన్స్ కి ఈ వారం పెద్ద పండగే అని చెప్పాలి. రేపు ఏకంగా మూడు క్రేజీ సినిమాలు ఓటీటీ లో సందడి చేయనున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘జవాన్’. సెప్టెంబర్ 7 వ తారీఖున విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రేపు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు , తమిళం , హిందీ భాషల్లో విడుదల కానుంది.

Jawan

మరో పక్క డిస్నీ + హాట్ స్టార్ లో రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘స్కంద‘ రెండు కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిల్చింది కానీ, మాస్ ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చే సినిమానే. ఈ సినిమాతో పాటుగా రేపు అర్థ రాత్రి నెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ యూత్ ఫుల్ హిట్ ‘మ్యాడ్’ కూడా విడుదల కాబోతుంది.

- Advertisement -
Skanda

ఇలా వరుసగా క్రేజీ సినిమాలన్నీ విడుదల అవ్వబోతుండడం తో ఆడియన్స్ కి ఏ సినిమాని చూడాలో అర్థం కావడం లేదు. చాలా కాలం తర్వాత ఆడియన్స్ కి పెద్ద పండుగ వాతావరణం నెలకొంది అని అనే చెప్పొచ్చు. వీటితో పాటుగా మొంత్ ఆఫ్ మధు అనే కొత్త చిత్రం కూడా ఆహా లో స్ట్రీమింగ్ రేపే కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here