OTT Movies : ఒక్క రోజులో 29 క్రేజీ సినిమాలు.. చరిత్ర లో ఇదే తొలిసారి!

- Advertisement -

OTT Movies : ఈమధ్య కాలం లో ప్రతీ శుక్రవారం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లో కూడా వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో వచ్చి రెండు మూడు వారాలు అయ్యాక ఓటీటీ లో విడుదల అవుతుంటే, కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్లు నేరుగా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అలా ఈ వీకెండ్ తెలుగు , హిందీ , తమిళం, కన్నడ, మలయాళం తో పాటుగా హాలీవుడ్ తో కలిపి ఏకంగా 29 సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

OTT Movies
OTT Movies

అందులో తమిళ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ రేపు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ సినిమా, వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది.

అలాగే సంగీత్ శోభన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ప్రేమ విమానం’ కూడా జీ 5 లో విడుదల కాబోతుంది. రీసెంట్ గా ఈ హీరో నుండి ‘మ్యాడ్’ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఇందులో అతని నటనకి అద్భుతమైన మార్కులు కూడా పడ్డాయి. అమెజాన్ ప్రైమ్ లో మార్క్ ఆంటోనీ తో పాటుగా రెండు ఇంగ్లీష్ సినిమాలు, ఒక ఇటాలియన్ వెబ్ సిరీస్ మరియు ఒక హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక డిస్నీ + హాట్ స్టార్ లో గూస్ బంప్స్ , సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ మరియు మధగమ్ పార్ట్ 2 వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

- Advertisement -

ఇక ప్రతీ వారం ఒక క్రేజీ సినిమా తో మన ముందు ఉండే నెట్ ఫ్లిక్స్, ఈసారి మాత్రం పెద్దగా పాపులారిటీ లేని సినిమాలు మరియు వెబ్సెరీస్ లతో మన ముందుకు వచ్చింది. 7 కొత్త రెలీజ్లు ఉండగా, అందులో నాలుగు సినిమాలు మరియు మూడు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఇక ఆహా మీడియా లో మిస్టేక్ మరియు మట్టికథ సినిమాలు రేపు స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయ్. ఇక సోనీ లివ్, బుక్ మై షో , యాపిల్ ప్లస్ టీవీ , లయన్స్ గేట్ ప్లే, జిఓ సినిమా, ఈటీవీ విన్ వంటి ఓటీటీ యాప్స్ ని కూడా కలిపి మొత్తం 29 సినిమాలు రేపు స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here