OTT లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే!

- Advertisement -

OTT అనేది చాలా కాలం నుండి వృద్ధిలోనే ఉంది కానీ, కరోనా లాక్ డౌన్ సమయం లో మాత్రం సినీ రంగం లో ఓటీటీ అనేది ఒక విప్లవం సృష్టించింది అనే చెప్పాలి.ఏ రేంజ్ లో అంటే ఆడియన్స్ థియేటర్స్ కి ఒక రేంజ్ టాక్ వస్తే కానీ కదలడం లేదు, ఆ రేంజ్ లో ఓటీటీ ఇప్పుడు ఎదిగిపోయింది.ఇప్పుడు ఏ సినిమా అయినా ఎంత పెద్ద సూపర్ హిట్ సాధించినప్పటికీ 50 రోజుల లోపే ఓటీటీ లో అందుబాటులోకి వచ్చేస్తుంది.

కొన్ని సినిమాలు అయితే థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ లోనే రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలా గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి ఓటీటీ లో విడుదలై అత్యధిక వ్యూస్ ని సాధించిన టాప్ 5 తెలుగు సినిమాల లిస్ట్ ని ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.

#RRR:

- Advertisement -
OTT
OTT

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లో అంతకు మించి హిట్ అయ్యింది.ఒక్క హిందీ తప్ప, మిగిలిన అన్ని ప్రాంతీయ బాషలలో ఈ సినిమాని జీ 5 యాప్ లో విడుదల చేసారు.రెస్పాన్స్ అదిరిపోయింది.అయితే కేవలం తెలుగు వెర్షన్ కి దాదాపుగా 500 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చినట్టు తెలుస్తుంది.అంటే 166 మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్నమాట.

వకీల్ సాబ్ :

vakeel sab
vakeel sab

సుమారుగా మూడేళ్లు సుదీర్ఘ విరామం తీసుకొని పవన్ కళ్యాణ్ చేసిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సమయం లో విడుదలైంది.ఆ సమయం లో లాక్ డౌన్ విధించడం తో మూడు వారాలకే థియేటర్స్ నుండి చిత్రాన్ని తీసివెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా దురదృష్టకరమైన సంఘటనల నడుమ విడుదలైన ఈ సినిమాని నాల్గవ వారం నుండి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు.రెస్పాన్స్ అదిరిపోయింది.ఇప్పటి వరకు ఈ చిత్రానికి 120 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట.ఇప్పటికీ ఈ సినిమాకి వీకెండ్స్ లో మంచి వ్యూస్ వస్తున్నట్టు సమాచారం.

నిశ్శబ్దం :

anuska
anuska

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క హీరోయిన్ గా నటించిన ఆఖరి చిత్రం ఇది.భాగమతి తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని అనుష్క చేసిన ఈ సినిమా లాక్ డౌన్ సమయం లో నేరుగా ఓటీటీ లోనే విడుదల చేసారు.సినిమాకి బాలేదు అనే టాక్ అయితే బాగా వచ్చింది కానీ, వ్యూస్ విషయం లో మాత్రం సూపర్ హిట్ రేంజ్ లో వచ్చాయి.అమెజాన్ ప్రైమ్ సంస్థ కి బాగా లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 90 మిలియన్ వ్యూస్ వచ్చాయట.

నారప్ప:

narappa
narappa

విక్టరీ వెంకటేష్ లాంటి టాప్ స్టార్ నుండి డైరెక్ట్ ఓటీటీ లో విడుదలైన సినిమా ఇది.అప్పట్లో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా ఓటీటీ లో చేసినందుకు వెంకటేష్ అభిమానులు పెద్ద రచ్చే చేసారు.తమిళం లో ధనుష్ హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అసురన్’ కి రీమేక్ ఇది.బ్రహ్మోత్సవం సినిమాతో ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాకి కూడా 85 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

మహర్షి :

maharshi
maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం.బెస్ట్ పాపులర్ ఫిలిం గా నేషనల్ అవార్డుని కూడా దక్కించుకుంది ఈ సినిమా.టీవీలలో ఎన్ని సార్లు వేసిన బోర్ కొట్టని ఈ సినిమాకి టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపొయ్యేవి.ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని అభిమానులు మరియు ప్రేక్షకులు ఎగబడి చూసారు, ఫలితంగా ఈ సినిమాకి 75 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com