OTT ఓటీటీలో ఇంట్రెస్టింగ్ సినిమాలు చూడాలని ఉందా.? ఇవి చూడండి..

- Advertisement -

OTT అందుబాటులోకి వచ్చాక థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పొచ్చు.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీ లో కూడా కుప్పలు తెప్పులుగా వస్తున్నాయి.. వెబ్ సిరీస్, థ్రిల్లింగ్, యాక్షన్, లవ్ రొమాంటిక్ అంటూ డిఫరెంట్ జోనర్స్ లో వస్తున్న సినిమాలు సినీ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి.. ఇక భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు అంటున్నారు మూవీ లవర్స్.. అయితే ఇటీవల వచ్చిన వాటిలో మిస్ అవ్వకూడని కొన్ని సినిమాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..

OTT
OTT

ఇరాట్ట (తెలుగు)
ఓటీడీలో మంచి టాక్ ను అందుకున్న సినిమాలలో ఇరాట్ట కూడా ఒకటి.. నెటిజన్స్ నోట ఎక్కువగా ఈ సినిమా పేరు వినిపిస్తోంది. రోహిత్ ఎం జి కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జోజు జార్జి నటనకు సినీ ప్రేక్షకులంతా మంచి మార్కులే వేశారు. మలయాళం లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లో కూడా చేశారు.. ఇరాట్ట సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

రన్ బేబీ రన్ (తెలుగు)
తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న రన్ బేబీ రన్ ను జయిన్ కృష్ణ దర్శకత్వం వహించారు. అక్కడ ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకోవటంతో మిగతా భాషల్లోకి డబ్ చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న హీరో అనుకోకుండా ఓ సమస్యలో ఎదుర్కొంటాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథ. ఈ కథలో అనేక మలుపులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టే చిత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటిటీలో తెలుగు సినిమాలు చూడాలనుకునే వారికి ఇరాట్ట, రన్ బేబీ రన్ బెస్ట్ ఛాయిస్.

- Advertisement -

వాల్వి ( మరాఠీ)
సీరియస్ క్రైమ్ చుట్టూ తిరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ వాల్వి.. పరేష్ మాక్షి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మొదటినుంచి చివరి వరకు ఎంగేజ్ అయ్యేలాగా కంటెంట్ ఉంటుంది. ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. భాషతో సంబంధం లేకుండా సినిమా చూడాలి అనుకునే వారికి ఈ సినిమా సూపర్ సెలక్షన్ అని చెప్పొచ్చు.

దాదా (తమిళ్):
ఓ ఇద్దరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లవ్ లో ఉంటారు. వారు ప్రేమలో ఉన్నప్పుడే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక ఆ తరువాత వారి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది. ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు అనేది ఈ సినిమా మిగతా కథ. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. గణేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన దాదా సినిమా ఓటీటీ లో మంచి టాక్ ను అందుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

గుల్మోహర్ (హిందీ):
మనోజ్ బాజ్ పేయ్, షర్మిల టాకూర్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ద్రిల్లర్ గుల్మోహర్.. రాహుల్ వి చిట్టేల్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది. ఈ చిత్రానికి మంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరికొన్ని సినిమాలు..
నెట్ఫ్లిక్స్ – అన్ లాక్డ్ (కొరియా)
అమెజాన్ ప్రైమ్ – తంకం (మలయాళం)
జీ 5 – బొమ్మై నయగి (తమిళ్)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here