Oscars 2023 : ఆస్కార్‌ బరిలో 10 ఇండియన్ సినిమాలు.. ‘RRR, కాంతార’లకు చోటు

- Advertisement -

Oscars 2023 : ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ పురస్కారం భావించే ఆస్కార్‌ పురస్కారం నామినేన్స్‌ బరిలో నిలిచిన సినిమాల తాజా జాబితాను ఆస్కార్స్‌ అకాడమీ వెల్లడించింది. ఈసారి ఆస్కార్ బరిలో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార మూవీస్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మన దేశం నుంచి 10 సినిమాలు ఈ బరిలో నిలిచాయి.

Oscars 2023
Oscars 2023

ఈనెల 24న ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాల తుది జాబితాను ‘ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డులకు పోటీపడేందుకు అవకాశం ఉన్న 301 చిత్రాలతో రిమైండర్‌ జాబితాను అవార్డ్స్‌ కమిటీ వెల్లడించింది. మన దేశం నుంచి అధికారికంగా ‘ది ఛల్లో షో’ నిలవగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కశ్మీరీ ఫైల్స్‌’, ‘కాంతార’, ‘విక్రాంత్‌ రోణ’, ‘గంగూభాయి కతియావాడి’, ‘మి వసంతరావ్‌’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ‘ఇరవిన్‌ నిళల్‌’ చిత్రాలు నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారం కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది.

రిమైండర్‌ జాబితాలో ఉన్న చిత్రాలు ఆస్కార్‌ అవార్డుల కోసం వివిధ విభాగాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ తుది జాబితాలో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఆస్కార్‌లో షార్ట్‌ లిస్టయిన 4 విభాగాల్లో ‘ఛెల్లో షో’, ‘ఆర్​ఆర్​ఆర్​’, ‘ఆల్‌ దట్‌ బ్రితెస్‌’, ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ చోటు దక్కించుకున్నాయి. ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ పది విభాగాల షార్ట్‌ లిస్ట్‌లను డిసెంబర్‌లో ప్రకటించింది.

- Advertisement -

ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘ఛెల్లో షో’, తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఆర్ఆ​ర్‌ఆర్​’లోని నాటు నాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంట్రీ సాధించింది. ‘ఆల్‌ దట్‌ బ్రితెస్‌’ డాక్యుమెంటరీ ఫీచర్‌గా, ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీ షార్ట్‌ కేటగిరీలో ఎంట్రీ పొందాయి. నామినేషన్లకు ముందు 3 ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ల్లో భారత్‌ చేరటం ఇదే మొదటిసారి.

గతేడాది విడుదలై సంచలనం సృష్టించింది ‘కాంతార’. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఈ మూవీ ఆస్కార్‌ నామినేషన్ల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ‘కాంతార’ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌ చెప్పింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ దక్షిణాది చిత్రం ఏకంగా రెండు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లకు అర్హత సాధించినట్లు ప్రకటించింది.

రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లకు అర్హత సాధించినట్లు హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. ‘‘కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. ఆస్కార్‌ ఫైనల్‌లోనూ కాంతార సత్తా చాటాలని కోరుకుంటున్నాం’’ అని ఈ సినిమాను ఆదరించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేసింది.

మరో కన్నడ చిత్రం ‘విక్రాంత్‌ రోణ’ కూడా ఆస్కార్‌ నామినేషన్ల బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ఆ చిత్ర బృందం కూడా ట్వీట్‌ చేసింది. ఈ సారి ఆస్కార్‌ అవార్డుల్లో మన దేశ చిత్రాలు సత్తా చాటాలని నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here