Oscar Gift: ఇప్పుడు అందరి నోటా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు గురించే.. ప్రపంచ సినిమా ఎవనికపై భారతదేశాన్ని తెలుగు సినిమా అద్భుతరించిన క్షణాలు ఇవి.. నాటు నాటు పాటకే కాకుండా మరికొన్ని హాలీవుడ్ చిత్రాలకు కూడా ఈ అవార్డులు లభించాయి.. కాకపోతే వీరికి ఎలాంటి ప్రైజ్ మనీ లభించదు.. కేవలం ఒక డాలర్ విలువ చేసే ఆస్కార్ అవార్డు ప్రతిమ మాత్రమే లభిస్తుంది. దానితో పాటు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ బ్యాగ్ కూడా ఇస్తారు. ఇది కేవలం విజేతలకు మాత్రమే ఇస్తారని అనుకుంటే పొరపాటే.. నామినేషన్ లో ఉన్న ప్రతి టీంకు ఈ గిఫ్ట్ బ్యాగ్ లభిస్తుంది.. ఈ గిఫ్ట్ బ్యాగ్ లో అసలు ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
లాస్ ఏంజెల్స్ కు చెందిన Distinctive Assets అనే సంస్థ ఈ గూడీ బ్యాగులను పంపిణీ చేస్తుంది. ఈ మార్కెటింగ్ కంపెనీకి ఆస్కార్ తో ఎలాంటి రిలేషన్షిప్ లేదు. కానీ 2002 నుంచి ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్ ను అందిస్తోంది. అయితే విజేతలకు మాత్రం ఈ గిఫ్టులు ఇస్తారా అంటే మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఆస్కార్ అవార్డు దక్కించుకొని సినీ దిగ్గజాలకు ఓదార్పు ఇవ్వడం కోసమే ఈ గిఫ్ట్ బ్యాగులు ఇవ్వడం వెనక ముఖ్య ఉద్దేశమని సమాచారం. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నా, నామినేషన్ లో నిలిచిన ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు వంటి ప్రధాన విభాగాల్లో నామినేట్ అయిన వారికి మాత్రమే ఈ గిఫ్ట్ బ్యాగ్ ఇస్తారట.
1,26,000 డాలర్లు (రూ.1.03 కోట్లు) విలువ చేసే గిఫ్ట్ బ్యాగ్ లభిస్తుందని సమాచారం. ఈ బ్యాగ్ లో జపనీస్ మిల్క్ బ్రెడ్, ఇటాలి లోని ఒక దీవికి, కాస్మెటిక్ ట్రీట్మెంట్ ట్రిప్, ఆస్ట్రేలియాలోని ఫ్లాట్ వంటివి ఉంటాయి. ఈ బ్యాగ్ లో సుమారు 60 కు పైగా బహుమతులు ఉంటాయి. ఇటలీ దీవిలో గల లైట్ హౌస్ లో ఉండేందుకు 9,000 డాలర్లు (సుమారు రూ. 7.3లక్షలు) విలువ చేసే కూపన్ ఉంటుంది. ఎనిమిది మంది ఆస్కార్ నామినేలు మూడు రాత్రులు ఇక్కడ సంతోషంగా గడపవచ్చు.
అలాగే ది లైఫ్ స్టైల్ అనే పది ఎకరాల కెనడియన్ ఎస్టేట్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ ట్రిప్ విలువ 40,000 డాలర్లు (సుమారు రూ. 32.7లక్షలు) వరకు ఉంటుంది. లిపో ఆర్మ్ స్కలిఫ్టింగ్ , హెయిర్ రిస్టోరేషన్, ఫేస్ లిఫ్ట్ వంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్ 41,000 డాలర్లు (సుమారు రూ. 33.7లక్షలు) వరకు చేయించుకోవచ్చు. మైసన్ కన్స్ట్రక్షన్ ద్వారా గృహ ఆధునీకరణల ప్రాజెక్టుల కోసం 25,000 డాలర్లు (సుమారు రూ. 20.5లక్షలు) వరకు రాయితీలు ఇస్తారు.