Orange : మెగా పవర్ స్టార్ క్రేజ్ ప్రస్తుతం మామూలు రేంజ్ లో లేదు.#RRR చిత్రం తో గ్లోబల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ని చూసి అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు.అందుకే ఆయన పుట్టినరోజు వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించడానికి పూనుకున్నారు ఫ్యాన్స్.అందులో భాగంగానే రామ్ చరణ్ కెరీర్ లో కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకున్న ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసారు.

ఫ్లాప్ సినిమాని మళ్ళీ థియేటర్స్ కి వెళ్లి ఎవరు చూస్తారు లే అని అనుకున్నారు ఫ్యాన్స్ సైతం.కానీ అనకాపల్లి నుండి హైదరాబాద్ వరకు ప్రతీ థియేటర్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడిపోయింది.ఈరోజు ఆదివారం అవ్వడం, దానికి తోడు సినిమాలోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇక ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి మొదటి రోజు కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.ఇది వరకు పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలు జల్సా(3.20 కోట్లు) మరియు ఖుషి చిత్రానికి(7.50 కోట్లు) మాత్రమే ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి.ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ వసూళ్లు వచ్చింది ఈ చిత్రానికే.హిట్ సినిమాలకు మంచి వసూళ్లు రావడం చాలా కామన్, కానీ ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు.
ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ కి ఈ రేంజ్ వసూళ్లు వాచినట్టు ఏ ఇండస్ట్రీ లో కూడా రికార్డు లేదు.ఆ అదృష్టం రామ్ చరణ్ కి మాత్రమే దక్కింది.ఇక పొరపాటున ఈ సినిమాకి బదులుగా ‘మగధీర’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి ఉంటె ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోండి అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేస్తున్నారు.