Guess The Actress : ఈ ఫొటో లో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె పాన్ వరల్డ్ స్టార్

- Advertisement -

Guess The Actress : క్రింద కనిపిస్తున్న ఈ చిన్నారిని ఎవరైనా గుర్తు పట్టారా..? ఈమె టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత కోలీవుడ్ మరియు బాలీవుడ్ లలో కూడా సూపర్ హిట్స్ అందుకొని అగ్ర కథానాయికగా ఎదిగింది.అలా కెరీర్ పీక్ స్థానం లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి అనగానే మీ అందరికీ గుర్తు వచ్చేసి ఉండాలే?,ఇంకా రాలేదా..!

Guess The Actress
Guess The Actress

ఆమె మరెవరో కాదు ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆసిన్.ఈ చిత్రం పెద్ద హిట్టైన తర్వాత ఆమెకి సౌత్ ఇండియా లో అవకాశాలు బాగా వచ్చాయి.పవన్ కళ్యాణ్ , ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ ఇలా ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించిన ఆసిన్ , తమిళం లో కూడా అజిత్ విజయ్ మరియు కమల్ హాసన్ వంటి హీరోలతో చేసి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది.

actress asin
actress asin

ఇక బాలీవుడ్ లో ఈమె అమిర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ ఇలా అక్కడి బడా సూపర్ స్టార్స్ అందరితో సినిమాలు చెయ్యడమే కాకుండా, భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది.బాలీవుడ్ లో ఒక్కసారి ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే ఆ హీరోయిన్ స్టార్ తిరిగినట్టే.చాలా మంది పీక్ కెరీర్ ముగిసిపోయిన తర్వాత సినిమాలను ఆపేస్తూ ఉంటారు.కానీ ఆసిన్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే మైక్రో సాఫ్ట్ కంపెనీ అధినేత రాహుల్ శర్మ ని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

- Advertisement -
actress asin photos
actress asin photos

ఆ తర్వాత కొన్నాళ్ళు సోషల్ మీడియా లో యాక్టీవ్ తన కొడుకుకి సంబంధించిన ఫోటోలు మరియు తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు అప్లోడ్ చేసింది కానీ, ఆ తర్వాత ఈమె ఎవరికీ కనిపించకుండా పోయింది.ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఆల్ ఈజ్ వెల్’.అభిషేక్ బచ్చన్ హీరో గా నటించిన ఈ చిత్రం తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.ఆమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here