Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తోంది. తాజాగా మరో సంచలన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రజ్వల్ రేవణ్ణ గురించి ఆమె వీడియో విడుదల చేసింది. కర్ణాటకలో సెక్యులర్ జనతాదళ్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం చేస్తున్నారు. కర్ణాటకలో జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సెక్యులర్ జనతాదళ్.. అధికార బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సరిగ్గా ఇదే సమయంలో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు బయటకు వచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ అమ్మాయిలతో సరదాగా గడిపిన అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 26న హాసన్ నియోజకవర్గానికి పోలింగ్ జరిగిన రోజు నుంచి ఈ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అనే క్యాప్షన్స్ తో ఈ వీడియోలు సర్క్యూట్ అవుతున్నాయి. దీంతో దేవెగౌడ కుటుంబం మొత్తం పరువు పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అసభ్యకర వీడియో కేసుకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో రేవణ్ణపై మహిళలను బెదిరించి లైంగికంగా వేధించడంతో పాటు అశ్లీల వీడియోలు చిత్రీకరించడం పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో 2800 మందికి పైగా మహిళలను బెదిరించి లైగింక వేధింపులకు గురి చేసి అశ్లీల వీడియోలు చిత్రీకరించిన రేవణ్ణ.. ఇప్పుడు జర్మనీకి పారిపోయాడని ఆమె పేర్కొన్నారు. అతనికి డబ్బు, పలుకుబడి ఉంది, అందుకే ఈ ప్రభుత్వం అతడిని ఏమీ చేయలేదు.. తను పారిపోయి జర్మనీలో దాక్కున్నాడు.
సాధారణ ప్రజలు అతడి మీద తిరగబడనంత వరకు తనకు శిక్ష పడుతుందని చెప్పలేమన్నారు. అంతేకాదు భారత మహిళలు అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా వారిని మాత్రమే కాదు మహిళల మీద ప్రేమ ఉన్న పురుషులను కూడా కోరుతున్నా దయచేసి ఇలాంటి ఆరోపణలు, కేసులు ఉన్నవారికి అసలు ఓట్లు వేయకండి. మహిళలను శక్తులుగా పూజించే మన దేశంలో ఇలాంటి వాళ్లను ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిద్దామా? అంటూ ఆమె ప్రశ్నించారు. అతడిని పట్టుకోలేని ఈ ప్రభుత్వం మనల్ని ఎలా కాపాడుతుంది.. ఒక్కసారి ఆలోచించి.. ఎవరికి వేయాలో వారికే ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో మహిళలకు రక్షణ కల్పించే వారికి మాత్రమే ఓటు వేయండి. అన్యాయం చేసే వారికి అధికారం ఇవ్వకండి అంటూ సూచించింది. మహిళలను ఇబ్బంది పెట్టే వారు ఇలాంటి పొజిషన్స్ లోకి వెళితే ఇక పరిస్థితి ఏమవుతుందో ఆలోచించమని కోరింది. మనం రామ రాజ్యం వైపు వెళ్తున్నామా? లేక రావణ రాజ్యం వైపు వెళ్తున్నామా? ఈ ప్రజ్వలను వదలొద్దని ఆమె డిమాండ్ చేశారు.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 29, 2024