Supritha : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి అంటే తెలియని వారుండరు. అక్క, వదిన, కోడలు ఇలా ఎలాంటి పాత్రకైనా సురేఖావాణి ఇట్టె ఇమిడిపోతుంది. టీవీలో యాంకరింగ్ తో కెరీర్ మొదలుపెట్టి తరువాత చాలా షోస్ కి హోస్టుగా వ్యవహరించారు సురేఖా వాణి. తరువాత సీరియల్స్ లో నటించారు. మొదటిసారిగా ‘భద్ర’ సినిమాలో రవితేజ కి వదినగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ రెడీ సినిమాలో చిట్టి నాయుడికి తల్లిగా అలరించిన పాత్ర అందరికీ బాగా గుర్తుండిపోతుంది. రామ్ పోతినేని, జెనీలియా నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది.
సురేఖావాణి లానే తన కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు హీరోయిన్ గా ఒక సినిమా కూడా చేస్తోంది సుప్రీత. అయితే ఎప్పటికప్పుడు తను ఎక్కడవున్నా తన ఫోటోలను మాత్రం తన అభిమానులకోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది సుప్రీత. సురేఖా వాణి, సుప్రితలు నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సుప్రిత తన తల్లికి బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నువ్వే నాకు సర్వస్వం అంటూ అమ్మ మీద ప్రేమను కురిపిస్తూ సుప్రిత వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియోలో సురేఖా వాణి, సుప్రితలు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి.
నువ్వే నా సపోర్ట్ సిస్టమ్.. నువ్వే నా బ్యాక్ బోన్ అంటూ ఇలా తన తల్లిపై సుప్రిత ప్రేమను కురిపించింది. ప్రస్తుతం అందరూ కూడా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని, కానీ తనకు మాత్రం తన తల్లి వాటిని నయం చేసే ఓ మోటివేషనల్ స్పీకర్, ఇన్స్పిరేషనల్ పర్సన్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. నాకోసం చేసిన ప్రతీ ఒక్క పనికి థాంక్స్ అమ్మా అంటూ ఇలా సురేఖా వాణి మీద సుప్రిత పోస్ట్ వేసింది. ఇక సురేఖా వాణి బర్త్ డే సందర్భంగా ఆమె తోటీ నటీమణులు విషెస్ చెప్పారు. సీనియర్ నటి రజిత, సనా వంటి వారంతా తమ ఫ్రెండ్ బర్త్ డేకు స్పందిస్తూ విషెస్ తెలిపారు.
View this post on Instagram