Lakshmi Pranathi : స్టార్ హీరోల భార్యలకు హీరోలకు మించిన ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు..హీరోల భార్య అనే ట్యాగ్ కాకుండా సొంతంగా ఇమేజ్ ను పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.. ఈ మధ్యకాలంలో చాలా మంది అలానే సోషల్ మీడియాలో ఫెమస్ అవుతున్నారు..ఈ క్రమంలో మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సతీమణులు తెలియనివారు లేరు. వీరు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. అయితే ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి వీరికి పూర్తి భిన్నం. ఆమె చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. సోషల్ మీడియా వాడరు. పబ్లిక్ లో పెద్దగా కనిపించరు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్, ప్రైవేట్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తారు.. ప్రతి ఈవెంట్ లో ఎప్పుడూ భర్త ఎన్టీఆర్ తో కనిపిస్తారు..
అయితే ఇప్పుడు తాజాగా ప్రణతి ఒంటరిగా, అది కూడా రోడ్డు మీద జనాల్లో నడుచుకుంటూ కనిపించింది.. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..గతంలో న్యూయార్ వేడుకలకు అమెరికాకు భర్త తో కలిసి వెళ్ళింది.. అక్కడే ఒక నెల ఉన్న ఈమే చాలా స్టైల్ గా ట్రెండిగా మారింది..ఫస్ట్ టైం ప్రణతి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. తాజాగా లక్ష్మీ ప్రణతి చార్మినార్ నైట్ బజార్ లో కనిపించారు. ఆమె ఒక్కరే షాపింగ్ చేయడానికి వెళ్లారు. పక్కన ఎన్టీఆర్ లేడు. ఎవరో ఆమె ఫోటోలు ఎవరో తియ్యగా వాటిని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతున్నాయి..
రంజాన్ వేల చార్మినార్ బజార్ మొత్తం చాలా బాగుంటుంది.. కొత్త కొత్త మోడల్స్ అన్ని తక్కువ రేటుకే దొరుకుతారు..ఈ నైట్ మార్కెట్ బాగా ఫేమస్. దీంతో లక్ష్మీ ప్రణతి షాపింగ్ చేయడానికి వెళ్లారు. అదన్న మాట మేటర్. 2011లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిలకు వివాహం జరిగింది. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్. వీరికి ఇద్దరు కుమారులు కాగా అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని పేర్లు పెట్టారు.. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో వీరి కూడా ఒకరు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు.
హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్స్ లో చిత్రీకరణ జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు. ఇక సముద్ర తీర నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ పాత్ర చాలా రౌద్రంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..