Kalki 2898 AD కల్కి సినిమాలో ఎన్టీఆర్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో నిజం ఉందా? అనేది ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. అయితే కల్కిణిని నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఊహాగానాలు అంచనాలను పీక్స్‌కు తీసుకెళుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. బాహుబలి 2 రికార్డులు కూడా డేంజర్ జోన్‌లో పడే ఛాన్స్ ఉందని వినికిడి. ఎందుకంటే.. ఈ సినిమా కంటెంట్ పరంగానే కాదు, విజువల్స్ పరంగా కూడా అద్భుతం అంటున్నారు. కల్కిలో బలమైన యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన గ్రాఫిక్స్, బలమైన భావోద్వేగాలు ఉన్నాయని చెప్పబడింది. 5 VFX కంపెనీలు ఏకకాలంలో ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్‌పై పని చేస్తున్నాయి. అందులో మూడు భారతీయ కంపెనీలు, ఒకటి న్యూజిలాండ్ కంపెనీ, ఒకటి అమెరికా కంపెనీ అని తెలుస్తోంది.

కల్కి స్టార్ కాస్టింగ్ చూస్తే ఔరా అనాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఎన్టీఆర్ పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. యంగ్ టైగర్ కల్కిలో కాసేపు తెరపై కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఒకవేళ.. ప్రభాస్, ఎన్టీఆర్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు తగలబడిపోతాయ్.. అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. మే 9 వరకు ఆగాల్సిందే!