NTR For Amigos వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది ‘బింబిసారా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే,20 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేని కళ్యాణ్ రామ్ కి ఏకంగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను తెచ్చిపెట్టింది ఈ సినిమా.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమిగోస్’ ఈ నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.. సరికొత్త తరహా కథలను ఎంచుకునే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసాడు.. టీజర్ మరియు ట్రైలర్ కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది.. చూస్తూ ఉంటే కళ్యాణ్ రామ్ మరో భారీ హిట్ కొట్టేలాగానే ఉన్నాడని ఫ్యాన్ నమ్మకం తో ఉన్నారు.. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెయిన్ హైలైట్స్ ని ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముందుగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘బింబిసారా అప్పుడు మిమల్ని చూసాను, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అదే ఉత్సాహం తో చూస్తున్నాను..చాలా ఆనందంగా ఉంది.. నేను చేసే ప్రతీ సినిమా కొత్త గా ఉండాలని కోరుకుంటాను, అలాంటి కోతరకమైన సబ్జెక్టు ఈ అమిగోస్. ఈ ప్రపంచం లో మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు.. ఆ కాన్సెప్ట్ తో మా డైరెక్టర్ రాజేందర్ ఈ చిత్రాన్ని కమర్షియల్ ఫార్మాట్ లో చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
బింబిసారా పెద్ద హిట్ అవుతుందని అప్పుడు ఎంత నమ్మకం తో చెప్పానో, ఈ అమిగోస్ చిత్రం మీద కూడా అంతే నమ్మకం తో చెప్తున్నాను.. ఇక నేను నా జీవితం లో వేసే ప్రతీ అడుగులో తోడుంటూ నాతో అడుగులేస్తున్న నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఇక్కడకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు నాకు చాలా అనందం గా ఉంది..థాంక్యూ నాన్న’ అంటూ కళ్యాణ్ రామ్ స్పీచ్ ముగిస్తాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ప్రారంభం అయ్యే ముందే అభిమానుల కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోతాది, అప్పుడు ఎన్టీఆర్ అభిమానులపై చిరాకు పడుతూ ‘దయచేసి మీరు అరవడం ఆపండి.. నాకు అసలే ఆరోగ్యం బాగాలేదు. .నిలబడే పరిస్థితి లో కూడా నేను లేను, దయచేసి అర్థం చేసుకొని సహకరించింది’ అని అడుగుతాడు, అప్పటికీ కూడా అభిమానుల నినాదాలు ఆపకపోవడం తో కాస్త చిరాకు పడుతాడు ఎన్టీఆర్.
కాసేపటికి వాతావరణం చల్లపడిన తర్వాత ఆయన మాట్లాడుతూ ‘మా నందమూరి కుటుంబం లో ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేసేది మా అన్నయ్య కళ్యాణ్ రామ్..ఆయన నుండి ఒక మాస్ మూవీ రావాలని ఎప్పటి నుండో కోరుకుంటూ ఉండేవాడిని, మొత్తానికి ‘బింబిసారా’ చిత్రం రూపం లో ఆయనకీ భారీ హిట్ తగిలింది..అందుకు నాకు చాలా సంతోషం గా ఉంది,ఈ చిత్రం కూడా అన్నయ్య కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నాను’ అంటూ ఎన్టీఆర్ మాట్లాడుతాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మైత్రి మూవీ మేకర్స్ పై నేను కొరటాల శివ జోక్స్ వేసుకుంటూ ఉంటాము. వీళ్లకు సుడి మామూలుగా లేదని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము.. ఎందుకంటే ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేసి, ఆ రెండు చిత్రాలను ఒక్క రోజు గ్యాప్ తో విడుదల చేసి భారీ హిట్స్ కొట్టారు..నాకు తెలిసి ఏ ఇండస్ట్రీ లో కూడా ఇలా జరిగి ఉండదు.
ఇక ఈ చిత్ర దర్శకుడు రాజేంద్ర రెడ్డి గురించి మాట్లాడుకోవాలి., ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దానిని కాదనుకొని సినిమా ఇండస్ట్రీ కి వచ్చాడు, ఈ సినిమా ప్రారంభం అయినప్పుడే ఆయన తల్లిగారు కాలం చెందారు. సినిమా పూర్తయ్యే ముందు ఆయన తండ్రిగారు చనిపోయారు.. బౌతికంగా ఇద్దరు తన పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు, ఆ సమయం లో కూడా అతడు ఈ సినిమా మీద అంత శ్రద్ద పెట్టి చేసాడంటే అతనికి సినిమా మీద ఎంత అభిమానం ఉందొ అర్థం అవుతుంది’.
ఇక ఎన్టీఆర్ 30 వ చిత్రం పై అభిమానులు ఎప్పటి నుండో అప్డేట్ అడుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అభిమానులు సినిమా అప్డేట్ గురించి అడుగుతూ ఉండగా, ఎన్టీఆర్ దానికి సమాధానం చెప్తూ దయచేసి అప్డేట్ ఎప్పుడూ ఎప్పుడూ అంటూ నిర్మాత మరియు డైరెక్టర్ పై ఒత్తిడి పెంచకండి, ఒక మంచి అకేషన్ చూసి చెపుదామని ఎదురు చూస్తున్నాను.. అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మించి అకేషన్ ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఈ నెలలోనే ఈ సినిమా ముహూర్తం ఉంటుంది, మార్చి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాము, వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల చేస్తాము’ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపాడు.