Allu Arjun – NTR టాలీవుడ్ లో స్టార్ హీరోలు స్నేహం ఉండేవాళ్ళని మనం ఎంతోమందిని చూసాము, వారిలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ కూడా ఒకరు.వీళ్లిద్దరు ఒకే కుటుంబం కాకపోయినా, వ్యక్తిగతంగా కుటుంబం సభ్యులతో సమానమైన బాండింగ్ ఉంటుంది.ఇద్దరినీ ఒకరినొకరు బావ బావ అని పిలుచుకుంటూ ఉంటారు.అంత మంచి సాన్నిహిత్యం బహిరంగంగా ఎన్నో సార్లు బయటపడింది కానీ, నిన్న నెటిజెన్స్ కి ట్విట్టర్ లో వీళ్లిద్దరి మధ్య సాగిన శారద చిట్ చాట్ చూపురులకు కనుల పండుగా లాగా ఉండింది అనే చెప్పాలి.

ముందుగా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తాడు.అప్పుడు అల్లు అర్జున్ వెంటనే ‘థాంక్యూ వెరీ మచ్ బావ, లాట్స్ ఆఫ్ హగ్స్’ అని రిప్లై ఇస్తాడు.అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దానికి రిప్లై ఇస్తూ ‘ఓన్లీ హ్యూగ్స్ యేనా, పార్టీ లేదా పుష్ఫ’ అంటాడు.అప్పుడు అల్లు అర్జున్ దానికి సమాధానంగా ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ స్టైల్ లో అంటాడు.

అలా సరదాగా సినిమాటిక్ పద్దతిలో సాగిపోయిన వీళ్లిద్దరి చిట్ చాట్ నిన్న సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేసింది.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఇద్దరు పాన్ వరల్డ్ సూపర్ స్టార్స్ ఇలా ఇంత స్నేహభావం తో మాట్లాడుకోవడం ని చూస్తే , మన దోస్తులతో ఎలా ఉంటామో, అది గుర్తుకొచ్చింది.సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి చర్చ.

బాండింగ్ అంటే ఇలా ఉండాలి,అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు ఈ సందర్భంగా కామెంట్స్ లో హీరోలిద్దరినీ అడుగుతున్నారు.మరి రాబొయ్యే రోజుల్లో వీళ్లిద్దరు చెయ్యబోతున్న మల్టీస్టార్ర్ర్ సినిమాకి ఇప్పటి నుండే సంకేతాలు ఇస్తున్నారా అనేది అభిమానుల్లో కలుగుతున్న సందేహం.ఒకవేళ ఉంటె మాత్రం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం చెల్లాచెదురు అయిపోవడం ఖాయం అనే చెప్పాలి.
