NTR 30 : రిలీజ్ డేట్ ప్రకటిస్తూనే అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పిన చిత్ర బృందం..!

- Advertisement -

NTR 30 : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్టీఆర్కు ఏ రేంజ్ లో పాపులారిటీ అందించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక మన ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్కు అభిమానులు పెరిగిపోయారు. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కు సంబంధించి తదుపరిచిత్రం ఎప్పుడు వస్తుందని అభిమానులు కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ సినిమా గత ఏడాది మార్చిలో విడుదల అయి.. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ తన తదుపరిచిత్రాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. అయితే కొరటాల శివ కాంబినేషన్లో సినిమా చేస్తున్నారని ప్రకటించాడే కానీ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు.

ntr 30

అయితే కొరటాల శివ అందిస్తున్న స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చకపోవడం వల్లే ఇన్ని నెలల పాటు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు శుభవార్త చెబుతూ సినిమా ఫిబ్రవరి నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని.. పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలిపి . అభిమానులను ఆనందానికి గురిచేసింది .అయితే ఇక్కడ మరో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే సినిమా వచ్చే ఏడాది అంటే 2024 ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నామని ప్రకటించి అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశలో ముంచేసింది చిత్ర బృందం.

- Advertisement -

అంటే ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి ఒక సినిమా కూడా రాదు అని తెలిసి అభిమానులు పూర్తిస్థాయిలో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ఏకంగా 16 నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎంపికైన విషయం తెలిసిందే. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కీలక పాత్రలో మలయాళం స్టార్ హీరో మోహన్లాల్ నటించడానికి ఒప్పుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here