తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ పై నో క్లారిటీ.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యేది అప్పుడే!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ మరో మూడు రోజుల్లో అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతుంది అని అనుకున్నారు.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఫ్యాన్స్ అందరూ ఎంతో ఓపికతో ఎదురు చూసారు, ప్రతీ నిమిషం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయా లేదా అని బుక్ మై షో యాప్ ని ఓపెన్ చేసి చూస్తూనే ఉన్నారు, కానీ అది జరగలేదు. దీనితో ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురి అవుతున్నారు. తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూసుకునేందుకు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్న సమయం లో ఇలా చేస్తే మీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తాము అంటూ బెదిరిస్తున్నారు.

Adipurush

అయితే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వకపోవడానికి కారణం కూడా ఉంది. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 500 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. పెట్టిన ఈ బడ్జెట్ మొత్తం తిరిగి రావాలంటే కచ్చితంగా టికెట్ రేట్స్ ఉండాల్సిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న టికెట్ రేట్స్ తో అయితే బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం. కాబట్టి కచ్చితంగా రేట్స్ కావాల్సిందే, అందుకే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నిర్మాతలు టికెట్ రేట్స్ హైక్ కి కావాల్సిన పేపర్స్ మొత్తం ప్రభుత్వాలకు పంపించి రేట్స్ ఇవ్వాల్సిందిగా అనుమతి కోరారు.

- Advertisement -
Prabhas

ఈ పేపర్స్ పరిశీలించిన తర్వాత టికెట్ రేట్స్ మంజూరు చేస్తారు. అప్పటి వరకు ఒక్క ప్రాంతం లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వవు. ఫ్యాన్స్ అప్పటి వరకు కచ్చితంగా ఎదురు చూడాల్సిందే. అయితే కేవలం ఆదిపురుష్ హిందీ వెర్షన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ ఇండియా వైడ్ గా 7 కోట్ల రూపాయిలు దాటేసినట్టు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here