దేవరలో జాన్వీ అలాంటి పాత్ర చేస్తుందా.. ఆ హీరో సవతి కూతురుట

- Advertisement -

ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని దేవర అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సముద్రం మధ్యలో చేతిలో గొడ్డలి పట్టుకుని సీరియస్ లుక్‏లో కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ అయితే అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

ఈ మూవీతో తెలుగుతెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. చిత్రంతో జాన్వీ కపూర్ సౌత్ లో బలమైన ముద్ర వెయ్యాలని తాపత్రయపడుతుంది. అయితే దేవర మూవీలో జాన్వీ కపూర్ లుక్ ని ఆమె బర్త్ డే స్పెషల్ గా మార్చ్ లోనే రివీల్ చేసారు మేకర్స్. తాజాగా దేవర చిత్రంలో జాన్వీ కపూర్ రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్ రోల్ లో కనిపించబోతున్న సైఫ్ అలీ ఖాన్ కి సవతి కూతురిగా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

సైఫ్ అలీ ఖాన్ సెకండ్ వైఫ్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ నటించనుంది. మరో సీరియల్ నటి మణి చందన సైఫ్ కి మొదటి భార్యగా జాన్వికి తల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ ఎన్టీఆర్ పాత్రను ట్రాప్ చేయడానికి ఆమె ఓ మత్స్యకారినిగా ఎన్టీఆర్ కి దగ్గర అవుతుందని చెబుతున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో దేవరలో జాన్వీ కపూర్ పాత్రపై ఈ చర్చ హాట్ హాట్ గా వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here