Rabinhood : నితిన్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు

- Advertisement -

Rabinhood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా హీరోగా రాణిస్తున్న వారిలో నితిన్ ఒకరు. ఆయన చేసిన ప్రతి సినిమా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంటుంది. అలాగే నితిన్‌కి కూడా తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. ఇందులో భాగంగానే ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా నితిన్‌కు సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్నాడు.

ఈ సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ టాక్. ఇక గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బ‌స్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నితిన్ కు సరైన హిట్ పడలేదు. దీంతో మళ్లీ ఇదే కాంబో రిపీట్ అయితే బ్లాక్ బ‌స్టర్ అవుతుందని నితిన్ అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తనను తాను మరోసారి ఎలివేట్ చేసుకోబోతున్నాడు హీరో నితిన్. ఈ క్రమంలో ఈ సినిమాల్లో బాలీవుడ్ హీరో విలన్ గా నటించబోతున్నాడు అంటూ వార్త వైరల్ అవుతోంది.

- Advertisement -

 

 

దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. ఇటీవల యానిమల్ సినిమాలో విలన్ రోల్ ప్లే చేసిన బాబి డియోల్‌ను నితిన్, వెంకీ కుడిముల కాంబోలో విలన్ గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఇక సినిమా దాదాపు ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. యానిమల్ తో బాబి డియోల్‌కు వచ్చిన పాపులారిటీని ఈ సినిమాలో యూజ్ చేసుకునే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా తెర‌కెక్కిన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. వెంకీ కుడుముల ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఆయన హ్యాట్రిక్ హిట్ పడ్డట్లే అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here