Actor Nithin : పుట్టిన రోజు నాడు బస్సెక్కిన నితిన్.. ఏదో కొత్తగా ఉంది ‘తమ్ముడు’

- Advertisement -

Actor Nithin : హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ హీరో తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్. 1983 మార్చి 30న జన్మించాడు. తండ్రి పేరు సుధాకర్ రెడ్డి.. నైజాం డిస్ట్రిబ్యూటర్ మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలను చూసుకుంటూ పెరిగిన నితిన్ కి హీరో కావాలనే కోరిక బలంగా ఉండేది. అలా జయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ తగ్గించి ఆచి తూచి సినిమాలను చేస్తున్నాడు.

గతేడాది ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. ఇక ఆ తర్వాత నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత అనుభవాల దృష్ట్యా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నితిన్. ఇక వకీల్ సాబ్ సినిమాతో పవర్ ప్యాకెడ్ విజయం సాధించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ టైటిల్ తో వస్తుండడంతో టాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ లో కొంత షూటింగ్ షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. ‘కాంతార’ సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్. ఈ పోస్టర్ లో హీరో నితిన్ బస్సుపై ఓ శూలాన్ని పట్టుకుని కూర్చున్నాడు. అలాగే కింద ఎవరో మహిళ బస్సు నడుపుతున్నట్టుగా కనబడుతుంది. పోస్టర్ చూస్తుంటే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here