Janhvi Kapoor : ఆ సినిమా నుంచి జాన్వీ అవుట్.. మొత్తం పెంట పెంట చేసేశారుగా..!

- Advertisement -
Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది జాన్వీ పేరు. మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఓ వైపు తనకు వస్తున్న అవకాశాలు చూసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. సినిమాలు లేక మిగతా హీరోయిన్స్ అల్లాడిపోతుంటే .. ఈ ముద్దుగుమ్మ చాక్లెట్ తిన్నంత ఈజీగా ఆఫర్స్ ఎలా పట్టేస్తుందంటూ ఆలోచనలో పడ్డారు.

ఇది ఇలా ఉంటే వీరి దిష్టే జాన్వీ పాపకు తగిలిందేమో అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఖాతాలో మంచి ఆఫర్ మిస్ అయ్యిందట. ఆమె క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకుంట్లున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవర సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది జాన్వీ. దాంతో పాటు ఇటీవల బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఓకే అయింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగాయి.

- Advertisement -

అంతేకాదు విజయ్ దేవరకొండ-విజయ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఓకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ తప్పుకుందట. తొలుత ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ పాత్ర అని చెప్పి.. మేకర్స్ ఆ తర్వాత ఆమెను సెకండ్ హీరోయిన్ పాత్రకు మూవ్ చేశారట. ఆ కారణంగానే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here