ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నితిన్ తన తొలి సినిమా ‘జయం’ తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసి, టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘దిల్’మరియు ‘సై’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తగిలాయి. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వరుసగా 12 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, హీరో నితిన్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరితో కలిసి సినిమాలు చేసాడు. వీవీ వినాయక్ తో ‘దిల్’, రాజమౌళి తో ‘సై’,పూరి జగన్నాథ్ తో ‘హార్ట్ అట్టాక్’, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘అ..ఆ!’, కృష్ణ వంశీ తో ‘శ్రీ ఆంజనేయం’ ఇలా ఏ స్టార్ హీరో కి కూడా దక్కని అదృష్టం నితిన్ కి దక్కింది, కానీ సరైన టైమింగ్ మరియు ప్లానింగ్ లేక ఇంకా మీడియం రేంజ్ హీరో లీగ్ లోనే మిగిలిపోయాడు.

ఇది ఇలా ఉండగా నితిన్ ప్రముఖ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉందట, కానీ డేట్స్ సర్దుబాటు కాక వదిలేసుకోవాల్సి వచ్చిందట. గత కొంత కాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ నితిన్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఒక డైరెక్టర్ తో ఛాన్స్ వచ్చి, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మిస్ అయ్యి, అరెరే మంచి సినిమాని మిస్ చేసుకున్నానే అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా’ అని నితిన్ ని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ జయం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో డైరెక్టర్ శంకర్ గారు వచ్చి నాకు బాయ్స్ సినిమా కథ వినిపించాడు.
కానీ అదే సమయం లో జయం సినిమా షూటింగ్ జరుగుతుంది, మరో పక్క ఈ ప్రాజెక్ట్ కి డేట్స్ ఇవ్వాలి, రెండు సర్దుబాటు కాక, బాయ్స్ సినిమాని వదిలేసుకోవాల్సి వచ్చింది. దుకు మంచి సినిమాని మిస్ అయ్యానే అనే బాధ ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు నితిన్.