రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తున్న నిఖిల్ స్పై సినిమా

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో నిఖిల్ తాజాగా స్పై సినిమాలో నటించారు. కార్తికేయ – 2 తో పాన్ ఇండియా హీరోగా నిఖిల్ పేరు సంపాదించుకున్నాడు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే నమ్మకంతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో వరుస హిట్లు సాధిస్తున్నాడు నిఖిల్.

స్పై సినిమా
స్పై సినిమా

ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం స్పై.. ఈ చిత్రానికి గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది.

సోలో హీరోగా స్వామి రారా సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నిఖిల్ రీసెంట్ గా వచ్చిన 18 పేజీల సినిమా వరకు వరస విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈ స్పై సినిమాతో కూడా విజయం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -
nikhil

తాజాగా స్పై సినిమా టీజర్, ట్రైలర్ కూడా విడుదలయ్యాయి. ప్రేక్షకులు మెప్పు పొందాయి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె రాజశేఖర్‌రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా.. ఓపెనింగ్ అయిన 9 నిమిషాల్లోనే ఈ సినిమా బుకింగ్స్ అన్ని క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.. బుకింగ్స్ క్లోజ్ కావడంతో స్పై సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా అభిమానులను ఏ మేరకు అంచనాలను చేరుకుంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here