ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు నిఖిల్ సిద్దార్థ్. ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయం ఎంత జీనియస్ అనేది అర్థం అవుతుంది. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ స్క్రిప్ట్ సెలక్షన్ టాలెంట్ లేదనే చెప్పాలి.

అసలు ఇలాంటి పాయింట్ మీద కూడా సినిమాలు తియ్యొచ్చా అనేలా ఉంటుంది నిఖిల్ స్క్రిప్ట్ ఎంపిక. రీసెంట్ గానే ఆయన పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో ‘కార్తికేయ 2 ‘ చిత్రం ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆయన మరోసారి ‘స్పై’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటాలి అనుకుంటున్నాడు. టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా సినిమాకి సంబంధించిన ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత అందరికీ అనిపించేది ఏమిటంటే, టీజర్ లో చూపించిన పాయింట్ కి, ట్రైలర్ లో చూపించిన పాయింట్ కి అసలు సంబంధమే లేదే అని అనిపిస్తుంది. టీజర్ లో నేతాజీ సుభాష్ చంద్ర బాస్ అస్థికలను వెతికే స్పై గా నిఖిల్ ని చూపించారు. కానీ ఇందులో మాత్రం కనిపించకుండా పోయిన తన అన్నయ్య గురించి వెట్టుకుంటూ వెళ్లిన స్పై గా చూపించారు.

ఇక ఈ కథకి మరియు నేతాజీ కి మధ్య ఉన్న లింక్ ఏమిటి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో నిఖిల్ కి అన్నయ్య గా ‘ఆర్యన్ రాజేష్’ నటించాడు. ఇక ట్రైలర్ చివర్లో రానా కనిపించడం అందరికీ బిగ్ సర్ప్రైజ్.ఆయన చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది, ‘స్వాతంత్రం ఎవరో ఇచ్చేది కాదు.. లాక్కునేది’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే 28 వ తారీఖు వరకు ఆగాల్సిందే.