Niharika ఇటీవల కాలంలో మెగా డాటర్ నిహారిక పేరు మార్మోగిపోతుంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి చిన్న వెబ్ సిరీస్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి వెబ్ సిరీస్ లు చేస్తూ.. నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడింది. కానీ ఆమె పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లి అయిన కొన్నాళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో నిహారిక విడాకులు విషయం ఎంత హాట్ టాపిక్ అయిందో చూస్తూనే ఉన్నాం. నెటిజన్లు నిహారికను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిహారిక కారణంగా మెగా ఫ్యామిలీ నానామాటలు పడాల్సి వచ్చింది. తాజాగా నిహారిక విడాకులకు కారణం ఓ ప్రముఖ యూట్యూబర్ అని తెలుస్తోంది.
ఆయనతో క్లోజ్ గా ఉండడం వల్లే తన భర్త చైతన్య నిహారికపై అనుమానపడి విడాకులు ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. నిహారిక ఆ యూట్యూబర్ కి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రాగానే మెగా ఫ్యామిలీ పై కూడా నెటిజన్స్ చాలా దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. అయితే యూట్యూబర్ తో తనకు రిలేషన్ షిప్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై నిహారిక ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టింది. ఆ యూట్యూబ్ మరెవరో కాదు నిఖిల్ విజయేంద్ర సింహ. ఇటీవల నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిహారిక ఒక పోస్ట్ పెట్టింది. నిహారిక నిఖిల్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ నిఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. మీరు హోస్ట్‌గా ప్రారంభించి, కో-నటుడిగా, నిర్మాతగా మారి ఇప్పుడు నా తమ్ముడిగా మారారు. మనం ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. మీరు చాలా దయగల వ్యక్తులలో ఒకరు. లవ్ యూ నిక్కీ హ్యాపీ బర్త్ డే నాన్నా అంటూ నిహారిక పోస్ట్ చేసింది. ఇప్పుడు నిహారిక చేసిన పోస్ట్ తో ఈ ఇద్దరిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.