వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి రోజే నిహారిక కొణిదెల రెండవ పెళ్లి..? వరుడు ఎవరో చూస్తే మెంటలెక్కిపోతారు!

- Advertisement -

ఇన్ని రోజులు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా కొనసాగిన వరుణ్ తేజ్ నేడు త్వరలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లాడబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగి చాలా రోజులు అయ్యింది. వరుణ్ తేజ్ కి ఉన్న సినిమాల కమిట్మెంట్స్ కారణంగా డిసెంబర్ లో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

వరుణ్ తేజ్-లావణ్య
వరుణ్ తేజ్-లావణ్య

డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట ఆయన స్పెయిన్ లో వివాహం చేసుకోవాలని చూస్తున్నాడు. తనకి సంబంధించిన ప్రతీ విషయం ప్రైవేట్ గా ఉండాలని కోరుకునే వరుణ్ తేజ్, ఎవరికీ అందుబాటులో ఉండే విధంగా కాకుండా ఇలా ప్లాన్ చేసాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.

అదేమిటంటే నాగబాబు తన కూతురు నిహారిక కొణిదెల కి రెండవ పెళ్లి కూడా అదే రోజు చేసే ప్లాన్ లో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఒకే ముహర్తం లో అటు వరుణ్ తేజ్ పెళ్లి, ఇటు నిహారిక కొణిదెల రెండవ పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాడట. నిహారిక రీసెంట్ గానే తన భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి విడాకుల నోటీసు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉంది.

- Advertisement -

అయితే ఈ నాగబాబు మాత్రం నిహారిక ని అలా ఒంటరిగా వదిలేయడం కుదరదని, వరుణ్ తేజ్ తో పాటుగానే పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. వరుడుని కూడా చూసేశారట, ఇండస్ట్రీ కి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని, ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకుతో పెళ్లి చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here