Niharika: విడాకులు కాకముందే ఆ పనిపై ఫోకస్ పెట్టిన నిహారిక

- Advertisement -

Niharika: కొన్ని రోజుల నుంచి నిహారిక విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించింది. ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే నిహారిక నిర్మాతగా మారి బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది.

Niharika
Niharika

హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్‌ నిహారిక (Niharika Konidela). ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘సైరా నరసింహారెడ్డి’లో భాగ్యగా అలరించింది. నిహారికకు సినిమాల కంటే వెబ్‌ సిరీస్‌లు బాగా కలిసి వచ్చాయి. ఆమె నటించిన ‘ముద్దపప్పు అవకాయ’ వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచి మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో వరుసగా అలాంటి వెబ్‌ సిరీస్‌లు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెబ్‌ సిరీస్‌ల్లో నటించడమే కాదు వాటికి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

chaithanya

ఇకపై నిర్మాతగా బాగా బిజీ కావాలని హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసింది న‌టి..నిర్మాత నిహారిక‌. కాగా నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తుంది. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేసింది. తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. నిహారిక ప్రయత్నం సక్సెస్ కావాలని. తన బ్యానర్ లో హిట్ చిత్రాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here