Niharika Konidela : మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ గా నిల్చిన సంగతి తెలిసిందే.తన భర్త చైతన్య తో విడాకులు తీసుకుంది అంటూ కొంతకాలం నుండి ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది.ఒకరికొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో అవ్వడమే కాకుండా, గతం లో వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలను మరియు పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేసేసారు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.ఏ చిన్న రూమర్ వచ్చినా వెంటనే స్పందించి ఇది సరైన న్యూస్ కాదు అని చెప్పే నాగబాబు కూడా సైలెంట్ గా ఉండడం తో, వీళ్లిద్దరు విడిపోయారు అనే నిర్ధారణకు వచ్చేసారు ఫ్యాన్స్.ఇటీవల కాలం లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న నిహారిక ఈ విషయం పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం విశేషం.

అయితే ఇంస్టాగ్రామ్ లో ఈమె ఎప్పటిలాగానే యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది.లేటెస్ట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు చిన్న టోపీ, నువ్వు నా జీవితం లో ఎంతో ముఖ్యమైనవాడివి, నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలి.లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ అతనితో క్లోజ్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది.

నిహారిక పక్కన ఉన్న అతను ఎవరు..?, కొత్త ప్రియుడా అంటూ ఇంస్టాగ్రామ్ లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. ఇంత ఎమోషనల్ గా ఒక పోస్టు పెట్టిందంటే అతను కచ్చితంగా ఆమె మనసుకి ఎంతో దగ్గరైన వ్యక్తి అయ్యుంటాడని అనుకుంటున్నారు.
