టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కుటుంబం నుండి వచ్చిన హీరోలందరూ సక్సెస్ అయ్యారు.. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన Niharika నిహారిక కొణిదెల మాత్రం సక్సెస్ కాలేకపోయింది.. భారీ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల కి సరైన సక్సెస్ మాత్రం రాలేదు.. నాగ శౌర్య హీరో గా నటించిన ‘ఒక మనసు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా నిహారిక తొలి సినిమాతోనే రొమాన్స్ డొసేజ్ ఎక్కువ అయిపోయింది అనే నెగటివిటీని ఎదురుకుంది.
ఆ తర్వాత ఆమె తమిళం లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అక్కడ కూడా సక్సెస్ రాలేదు. ఇక ఆ తర్వాత తెలుగు లో హ్యాపీ వెడ్డింగ్ మరియు సూర్యకాంతం వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన సై రా నరసింహా రెడ్డి చిత్రం లో ఒక చిన్న పాత్ర పోషించింది. ఇదే నటిగా ఆమెకి చివరి చిత్రం.
ఇక ఆ తర్వాత నిహారిక చైతన్య అనే అబ్బాయిని పెళ్ళాడి నటనకి గుడ్ బై చెప్పేసి తండ్రి నాగబాబు లాగానే నిర్మాతగా స్థిరపడిపోయింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు నిర్మించిన నిహారిక కొణిదెల మంచి సక్సెస్ లనే అందుకుంది. అయితే సోషల్ మీడియా లో ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉండే నిహారిక ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
కొంత కాలం క్రితం ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బికినీ తో దిగిన ఫోటోలను తన స్టోరీ లో అప్లోడ్ చేసింది. అది ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. కొంతమంది అభిమానులైతే మెగా కుటుంబం నుండి వచ్చి ఇలాంటి ఫోటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీరు కూడా ఆ ఫోటోను చూసేయండి.