Niharika Konidela : మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు రాకపోవడం హీరోయిన్ రోల్స్ కి గుడ్ బై చెప్పి నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను తీస్తున్న నటి నిహారిక కొణిదెల.మెగా బ్రదర్ నాగ బాబు కూతురిగా, మెగా కుటుంబ సభ్యురాలిగా నిహారిక కొణిదెల కి మంచి క్రేజ్ ఉంది.అంతే కాదు సోషల్ మీడియా లో ఈమెకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.తనకి సంబంధించిన విశేషాలను, ఫోటోలను అప్లోడ్ చేస్తే అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది.

అయితే నిహారిక కొణిదెల తన భర్త చైతన్య తో విడాకులు తీసుకుంది అంటూ సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.అందుకు కారణం నిహారిక మరియు చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడమే.దానికి తోడు రూమర్స్ కి వెంటనే స్పందించే నిహారిక, విడాకుల వార్తపై మౌనం పాటించడం తో అభిమానుల్లో వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త నిజమే అని నిర్ధారణకు వచ్చేసారు.

ఇక ఉగాది సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి త్వరలోనే డిస్నీ + హాట్ స్టార్ లో తెరకెక్కబోయ్యే ‘డెడ్ పిక్సెల్’ అనే చిత్రం లో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.అప్పుడు కూడా ఆమె విడాకుల గురించి ఎలాంటి కామెంట్ చెయ్యలేదు.ఇదంతా పక్కన పెడితే నిహారిక కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నంట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సమ్మర్ వచ్చేసింది, మామిడి కాయలు తినాలి అంటూ ఒక పోస్టు పెడుతుంది.

సాధారణంగా మామిడి కాయ తినాలని గర్భం దాల్చిన ఆడపిల్లలకు అనిపిస్తుంది.అందుకే ఆమె పెట్టిన పోస్ట్ క్రింద నెటిజెన్స్ ‘గర్భం దాల్చావా, కంగ్రాట్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అంటే విడాకులు తీసుకునే సమయం లో నిహారిక గర్భవతి అయ్యిందా అంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త.

గతంలో ఒక సింగర్ విషయంలో కూడా తల్లి కాబోతుందంటూ కోకొల్లలుగా వార్తలు వచ్చాయి. ఆమె మామిడి తోటలో మామిడి కాయతో ఫోటో దిగి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఇక ఇప్పుడు నిహారిక మామిడి కాయ తింటున్న ఫోటోలు వీడియో షేర్ చేసింది. కొంతమంది ఆమెకు కంగ్రాట్స్ అంటూ మెసెజెస్ చేస్తుంటే.. మరి కొందరు అక్కా బావ ఎక్కడ అంటూ సెటైరికల్‌గా అడుగుతున్నారు. చిన్నా పెద్ద ఛానల్స్ అనే తేడా లేకుండా అందరూ నిహారిక తల్లి కాబోతోందహో అంటూ వార్తలు గుప్పిస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే కనీసం నాగ బాబు అయినా రెస్పాన్స్ ఇవ్వాల్సిందే.