Niharika Konidela : ఒక్క ఫొటోతో విడాకులు కన్ఫామ్ చేసిన నిహారిక..

- Advertisement -

గత కొన్ని రోజుల నుంచి నిహారిక ( Niharika Konidela ) విడాకులు తీసుకుందని నెట్టింటి జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఆ విషయాన్ని ఒక్క ఫొటోతో కన్ఫామ్ చేసేసింది. దీంతో ఆమె సమంత, శ్రీజా వంటి సెలెబ్రిటీలను ఫాలో అవుతోంది అంటున్నారు. విడాకులు పరోక్షంగా తెలియజేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలోనే కారణాలు కూడా వెతికేస్తున్నారు.

Niharika Konidela
Niharika Konidela

నిహారిక భర్త వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించింది. అలాగే ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేసింది. ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ.. నిహారిక అకౌంట్లోని తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. కొన్ని అరుదైన జ్ఞాపకాలు మాత్రం ఉంచుకొని.. కేవలం చైతన్యతో ఉన్న ఫోటోలు మాత్రం తీసేసింది. అమ్మ నిశ్చితార్థం చీర కట్టుకున్న ఫోటో, హల్దీ ఫంక్షన్ ఫోటో.. ఇలా ఒకటి రెండు మాత్రమే ఉంచింది. ఈ క్రమంలో.. నిహారిక పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమే అంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Niharika Konidela marriage

2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు. నిహారిక-వెంకట చైతన్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరు కాగా నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. పెళ్లి తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్ పెట్టాలనే తన కోరిక కూడా తీరిందని.. కొత్తగా ఆఫీసు ప్రారంభించి ఆ ఫొటోలను షేర్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here