సినిమా ఇండస్ట్రీలో విడాకుల కామన్. సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తుంటాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య జంట విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వైవాహిక జీవితం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది. నిహారిక 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందనిపించుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ నిహారిక, చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.

అదే సమయంలో నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె నటిగా బిజీ అవుతున్నారు. డెడ్ ఫిక్సెల్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. తన నిర్మాణ సంస్థ పేరున ఆఫీస్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం విహారాలు చేస్తుంది. నిహారిక వేకెషన్ కోసం బాలి దేశం వెళ్లారట. తన వెకేషన్ ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిహారికను సమంతతో పోల్చుతున్నారు. సమంత కూడా విడాకుల ప్రకటనకు ముందు ఇలానే చేసింది. మిత్రులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్ళింది.

డిప్రెషన్ నుండి భయట పడేందుకు సమంత ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంది. కొన్ని ఆధ్యాత్మిక టూర్స్ కి కూడా సమంత ఆ టైం లో వెళ్లారు. నిహారిక టూర్స్ కి వెళ్లడానికి కూడా కారణం విడాకులే అంటున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలు చేసిన సంధి ప్రయత్నాలు బెడిసి కొట్టాయట. లాయర్స్ లీగల్ వర్క్ చేస్తున్నారట. త్వరలో విడాకుల ప్రకటన రానుంది అంటున్నారు. ఆ విధంగా విడాకుల విషయంలో సమంత-నిహారిక మధ్య పోలిక కుదిరింది అంటున్నారు. సమంత పాత రోజులు వదిలేసి హ్యాపీ లైఫ్ గడుపుతుంది. 2020 లో నిహారిక, వెంకట చైతన్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ వివాహానికి వేదిక అయ్యింది.