అప్పుడు నా డ్రెస్ జారిపోయింది.. అందుకే అలా చేశాను.. : నిహారిక

- Advertisement -

మెగా డాటర్ నిహారిక తాజాగా సోషల్ మీడియా రూమర్ క్రియేటర్స్ పై రెచ్చిపోయింది. అలాంటి వెధవలు ప్రతిచోట ఉంటారని, వారికి మనం అటెన్షన్ ఇవ్వకూడదంటూ వారిపై ఫైర్ అయింది. దీంతో తాజాగా నిహారిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఇటీవల పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా పెళ్లి తర్వాత సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఇప్పటికే నిహారిక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.

నిహారిక
నిహారిక

ఇంటర్వ్యూలో ఆన్‌లైన్‌ నెగెటివిటీపై నిహారిక స్పందించారు. ‘‘మన చుట్టూ ఎంతోమంది మూర్ఖులు ఉంటారు. అటెన్షన్‌ కోసం మరీ మూర్ఖంగా మారుతున్నారు. అలాంటి వాళ్లను పట్టించుకోకుండా ఉండటమే మంచిది. నటిగా అడుగుపెట్టిన కొత్తలో ఓ ఫంక్షన్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్నాను. నా డ్రెస్‌ ఇబ్బందిగా ఉండటం వల్లే నేను అలా కూర్చొవాల్సి వచ్చింది. అది జారిపోయేలా ఉంది.

అందుకే అలా కూర్చున్నా. అప్పుడు నా పక్క సీట్‌లో పెద్ద వ్యక్తి ఎవరో ఉన్నారు. దాన్ని చూసి కొంతమంది నెటిజన్లు నాపై విమర్శలు చేశారు. వాళ్ల మాటలకు అప్పట్లో బాధపడ్డాను కాబట్టే ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా’’ అని ఆమె వివరించారు. అనంతరం ఉపాసన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమె చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏ విషయంలోనూ గొప్పలకు పోదు. ఇక, సుస్మిత అక్క పర్సనల్‌ లైఫ్‌, వర్క్‌ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంది’’ అని నిహారిక బదులిచ్చారు.

- Advertisement -
Niharika Konidela

దీంతో నిహారిక చేసిన ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా నిహారిక కి తన భర్త చైతన్యతో తరచూ గొడవలు అవుతున్నాయని, అందుకే నిహారిక విడాకులు తీసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. అందుకే నిహారిక ఈ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా రూమర్ క్రియేటర్స్ పై అంత వైలెంట్ గా రియాక్ట్ అయి ఉంటుందని ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here