తెల్లా తెల్లాని చీరా.. జారుతున్నాదె సంధ్యవేళా.. నిధి అగర్వాల్ ని చూస్తూ ప్రస్తుతం కుర్రాళ్లు పాడుకుంటోంది ఈ పాటే. వైట్ శారీలో క్లీవేజ్ అందాలతో Nidhhi Agerwal తన సొగసు నిధినంతా నెట్టింట పెట్టేస్తోంది. తెల్లని చీరలో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది.
మున్నా మైఖేల్ అనే మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నిధి. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి మూవీలో సందడి చేసింది.ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించి బ్యాక్ టూ బ్యాక్ అన్నాదమ్ములతో రొమాన్స్ చేసింది.
ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన అకౌంట్లో వేసుకుంది నిధి. ఈశ్వరన్ మూవీతో కోలీవుడ్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ గా తలైవన్ అనే తమిళ్ మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పవర్ స్టార్ సినిమాతో సక్సెస్ అందుకొని టాప్ గేర్‌లో దూసుకెళ్లాలని చూస్తోంది.
ఈ భామ కర్నాటకలో పెరిగినప్పటికీ పుట్టింది మన హైదరాబాద్‌లోనే. నిధి హీరోయిన్ మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ కూడా. కథక్ వంటి సంప్రదాయ నృత్యంతోపాటు బెల్లీ డ్యాన్స్‌లోనూ స్పెషలిస్ట్.
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో కుర్రాళ్ల గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఘాటైన అందాలతో కైపెక్కించే పోజులతో యువకుల గుండెల్లో గుబులు రేపుతోంది. రీసెంట్ గా వైట్ శారీలో నిధి పోస్టు చేసిన ఫొటోలకు కుర్రకారు తెగ ఫిదా అవుతున్నారు.