Jayapradha : బాలీవుడ్ స్టార్ చెంప చెళ్లుమనిపించిన అలనాటి తార జయప్రద.. ఆ నటుడి రియాక్షన్ ఏంటంటే..?అందానికే అసూయ పుట్టించే అందం ఆమెది. తెలుగు తెరపైకి దివి నుంచి భువికి దిగి వచ్చిన ఓ ధ్రువతార ఆమె. గ్లామర్, డీ గ్లామర్, సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక.. ఇలా ప్రతి జానర్​లో తనదైన ముద్ర వేసిన మహానటి.. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా యువత, ఫ్యామిలీ అనే అన్ని రకాల ప్రేక్షకులను తనదైన నటనతో కనువిందు చేసిన సొగసరి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. అంటూ భాషాభేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలను తన అందంతో మైమరిపించిన నటి Jayapradha . పాత్ర ఏదైనా.. అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు. ఆమెను చూడగానే ఒక అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. అడవిరాముడు, ఊరికి మొనగాడు లాంటి మాస్ సినిమాల్లో నటించి అభిమానుల మందార మాలలు అందుకుంది జయప్రద. భారతీయ చిత్రపరిశ్రమకు దొరికిన ఓ మణిపూస ఆమె.

jayapradha
jayapradha

తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది జయప్రద. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. అప్పుడప్పుడు బాలీవుడ్​లో పలు రియాలిటీ షోలకు అలనాటి తారల ఎపిసోడ్​కు సంబంధించి గెస్ట్​ అప్పియరెన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ తరం యువత కూడా ఆమె అందానికి ఫిదా అవుతుంటారనే విషయం ఈ షోలలో ఆమె వచ్చినప్పుడు ఆ కార్యక్రమాల రేటింగ్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అయితే తాజాగా ఈ సీనియర్ బ్యూటీ గురించి ఓ వార్త బీ టౌన్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నటి జయప్రద.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ దలీప్ తాహిల్​కు సంబంధించి ఓ సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జయప్రద.. దలీప్‌ తాహిల్‌ చెంప చెళ్లుమనిపించిందంటూ బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలపై నటుడు దలీప్‌ తాహిల్‌ స్పందించాడు. జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చాడు.

 

Dalip Tahil
Dalip Tahil

1986లో అమితాబ్‌ బచ్చన్‌-జయప్రద జంటగా ‘ఆఖ్రీ రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలీప్‌ తాహిర్‌ విలన్‌గా చేశాడని, ఇందులో ఆయన జ‍యప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్‌ షూటింగ్‌ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్‌ షూటింగ్‌ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్‌ తాహిల్‌ అసహనం వ్యక్తం చేశాడు.