Varalakshmi Sharath Kumar : నువ్వేదో మంచిదానివి అనుకున్నాం.. వరలక్ష్మి శరత్ కుమార్ కు ఎన్ఐఏ నోటీసులు

- Advertisement -


Varalakshmi Sharath Kumar : కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు ఆమె కోలీవుడ్ అయినా టాలీవుడ్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. తన నటన‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టు్కుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో తను ఏదైనా సినిమాలో నటిస్తుంటుంది చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‌కు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కు తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నోటీసులు పంపించిందట. డ్రగ్స్‌ కేసులో సంబంధం ఉన్న ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించేందుకు.. కొచ్చిలోని ఎన్‌ఐఏ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశాలు సైతం జారీ చేసిందట.

వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర ఆదిలింగం అనే ఓ వ్యక్తి కొన్నాళ్ల కిందట అసిస్టెంట్ గా పనిచేశాడు. డ్రగ్స్, ఆయుధాలు సరఫరాలో అంతర్జాతీయ స్మగ్లర్‌ల‌తో అతనికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు.. ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జరిగిన ఎంక్వయిరీలలో ఆమె అసిస్టెంట్ ఆదిలింగం వద్ద నుంచి రూ.2,100 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్, AK47 గన్, 9 ఎంఎం తుపాకులు, మందు గుండు సామాగ్రిని ఎన్ఐఏ అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు.

varalakshmi sarathkumar
varalakshmi sarathkumar

స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి.. అబ్బుర పరిచే నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనూ తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్, క్రాక్, నాంది, వీర సింహారెడ్డి, హనుమాన్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. మొదటి తమిళ ఇండస్ట్రీలో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ‌, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతుంది. ఇక రీసెంట్ గా ఆమె తన ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. త్వరలోనే వైవాహిక‌ జీవితంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో వ‌ర‌ల‌క్ష్మి ఇలా చిక్కుల్లో పడడంతో అంతా అవాక్కవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here